హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: నవ వధువు దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా..?

Telangana: నవ వధువు దారుణ హత్య.. వివాహేతర సంబంధమే కారణమా..?

హత్యకు గురైన నవ్య

హత్యకు గురైన నవ్య

పెళ్లైనా కొద్ది నెలలకే ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు.

  పెళ్లైనా కొద్ది నెలలకే ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కట్టుకున్నవాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకోని అతడు ఈ దారుణానికి ఓడిగట్టినట్టుగా తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఏర్రుపాలెం గ్రామానికి చెందిన నాగశేషురెడ్డికి కొన్ని నెలల కిందట ఎర్రమల్ల నవ్య(22)తో వివాహం జరిగింది. అయితే పెళ్లైయినా కొద్ది రోజులకే వీరి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. నవ్య తరచూ సెల్ ఫోన్ చాటింగ్స్‌లో నిమగ్నమై ఉండడంతో నాగశేషు ఆమెపై అనుమానం పెంచుకున్నారు. ఎవరితోనో క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు భావించాడు. ఈ క్రమంలోనే భార్యతో పలుమార్లు వాగ్వాదానికి దిగాడు. అయితే తన మాటలు వినడం లేదని భావించిన నాగశేషు ఆమెను హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు.

  ఈ క్రమంలోనే పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి గుట్ట మీద అర్దరాత్రి నాగశేషు తన భార్య నవ్యను హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇందకు సంబంధించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధాల వల్లే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

  హత్యకు గురైన నవ్య

  భర్తతో నవ్య

  నవ్య హత్యకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Crime news, Husband kill wife, Khammam, Telangana

  ఉత్తమ కథలు