Home /News /telangana /

TELANGANA NATURE LOVERS STARTED SAVE BANYANS OF CHEVELLA GH EVK

Save Banyans of Chevella: 1100 మర్రి చెట్లను కాపాడుకుందాం.. చేవెళ్ల‌లో ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల ఉద్య‌మం

చేవెళ్ల మర్రి చెట్లును కాపాడాల‌ని పెయింటింగ్స్‌, పోస్ట‌ర్లు ప్ర‌ద‌ర్శిస్తున్న చిన్నారులు, పెద్ద‌లు (ఫోటో క్రెడిట్: CH మౌర్య):

చేవెళ్ల మర్రి చెట్లును కాపాడాల‌ని పెయింటింగ్స్‌, పోస్ట‌ర్లు ప్ర‌ద‌ర్శిస్తున్న చిన్నారులు, పెద్ద‌లు (ఫోటో క్రెడిట్: CH మౌర్య):

Save Banyans of Chevella: హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న 1100 మర్రి చెట్లను నరికేయడాన్ని నిరసిస్తూ 200 మంది పర్యావరణ యోధుల బృందం తాజాగా సమావేశమైంది. చేవెళ్ల సమీపంలో ఉన్న ఈ మర్రి చెట్లు (Banyan Trees) దశాబ్దాలుగా ఉన్నాయి.

చెట్లను నరికేయడం, అడవులు (Forest) అంతరించిపోవడం వల్ల కాలుష్యం (Pollution) పెరిగిపోయి పర్యావరణ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో చాలామంది పర్యావరణ పరిరక్షులు, నేచర్ లవర్స్ (Nature Lovers) ఈ అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అడవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న 1100 మర్రి చెట్లను (Banyan Trees) నరికేయడాన్ని నిరసిస్తూ 200 మంది పర్యావరణ యోధుల బృందం తాజాగా సమావేశమైంది. చేవెళ్ల సమీపంలో ఉన్న ఈ మర్రి చెట్లు దశాబ్దాలుగా ఉన్నాయి. హైదరాబాద్ మన్నెగూడ రహదారికి ఇరువైపులా మరో 9000 చెట్లు కూడా ఉన్నాయి. ఈ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) నిధులు మంజూరు చేయడంతో ఈ చెట్లపై గొడ్డలి వేటు పడే ప్రమాదం ఉంది.

దీంతో దీపావళి సందర్భంగా ఈ చెట్లను కాపాడాలంటూ పర్యావరణ పరిరక్షుల బృందం ఆందోళన నిర్వహిస్తున్నారు. వాటి వద్ద దీపాలు వెలిగించి ఈ పురాతన చెట్లను పరిరక్షిస్తామని ప్రతిజ్ఙ చేశారు. మర్రి చెట్లను రక్షించుకునేందుకు చిన్నారులు, పెద్దలు కలిసి పెయింటింగ్స్ (Painting), పోస్టర్ల (Poster)ను ప్రదర్శించారు. చెట్లకు ప్రేమతో దారాలు కట్టారు.

Huzurabad : TRS ఓటమికి అసలు కారణం ఇదే - రెండోసారీ ఫెయిలైన ట్రబుల్ షూటర్ Harish rao


దాదాపు వంద సంవత్సరాల క్రితం నిజాం నవాబులు ఈ మర్రి చెట్లను నాటారని ప్రచారంలో ఉంది. ఈ మర్రి చెట్లు జాతీయ వారసత్వమని, వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని నేచర్ లవర్స్ ఆఫ్ హైదరాబాద్ (Nature Lovers's of Hyderabad) బృందం సభ్యురాలు సాధన రాంచందర్ అంటున్నారు. ఈ మర్రి చెట్లను రక్షించుకునేందుకు సంస్థ సభ్యులు ఆన్‌లైన్ (Online) ద్వారా ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఒక వేళ చెట్లను నరికి మరోచోట నాటినా అవి ఒకేలా ఉండవు, వాటి కొమ్మలు కత్తిరించి వేస్తారు. అందుకే రహదారి విస్తరణ ప్రాజెక్టును ఆపాలని సాధన నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (Highways Authority of India)కు విజ్ఙప్తి చేశారు.

కరోనా అనంతర పరిస్థితుల్లో పర్యావరణ అసమతుల్యత వల్ల కలిగే అనర్థాలను ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు కాజల్ మహేశ్వరి. ఆమె సేవ్ కేబీఆర్ పార్కు (Save KBR Park) ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మొక్కలు నాటే కార్యక్రమాలు, సెలబ్రిటీలు మొక్కలు నాటినట్టు చూపించడం, తప్పుడు వార్తల ద్వారా ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయలేవని ఆమె అభిప్రాయపడ్డారు.

BJP MLA ఈటల రాజేందర్ తొలిరోజే చెప్పేశారు -KCR ఆయుధంతోనే TRSకు చెక్ పెట్టేలా


నివాసయోగ్యమైన నగరం కోసం నిజాయితీతో పనిచేస్తే అలాంటి ప్రభుత్వాలు అధికారంలో ఉంటాయని చెప్పారు. గద్దలు, హారియర్లను 2019లో ఐయూసీఎన్ అంతరించిపోయే వాటి జాబితాలో చేర్చినట్టు ఆమె గుర్తు చేశారు. పర్యావరణ యోధుల ఉద్యమాల కారణంగా ఈ రహదారి విస్తరణ ప్రాజెక్టును వాయిదా వేశారని, తాజాగా కేంద్రం నిధులు విడుదల చేయడంతో ప్రాజెక్టులో కదలిక వచ్చిందని ఆమె తెలిపారు.

ఈ రహదారిలో ప్రతిరోజూ తిరిగే వారు వారి జ్ఙాపకాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ‘సేవ్ బన్‌యన్స్ ఆఫ్ చేవెళ్ల’(Save Banyans of Chevella) పేజీలో స్థానికులు వారి జ్ఙాపకాలు పంచుకుంటున్నారు. మొయినాబాద్- హైదరాబాద్ రహదారికి ఇరువైపులా 125 సంవత్సరాల కిందట నిజాం మర్రి, మామిడి చెట్లు నాటించారని, తాము చిన్నప్పటి నుంచి ఈ చెట్ల నీడలో తిరుగుతున్నామని ఒకరు తన జ్ఙాపకాలను పంచుకున్నారు.
Published by:Sharath Chandra
First published:

Tags: Air Pollution, Central Government, Forest

తదుపరి వార్తలు