‘డబ్బులు ఇచ్చారుగా..ఎందుకు గెలవరు సార్’

Telangana Municipal elections 2020 results | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు ఓటర్లను తీవ్ర ప్రలోభాలకు గురిచేశాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌నుద్దేశించి ఓ నెటిజన్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

news18-telugu
Updated: January 25, 2020, 9:29 AM IST
‘డబ్బులు ఇచ్చారుగా..ఎందుకు గెలవరు సార్’
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
దావోస్ పర్యటన ముగించుకున్న మంత్రి కేటీఆర్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధిస్తుందని రిపోర్ట్స్ ఉన్నాయని, తాను పూర్తి ధీమాతో ఉన్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ ట్వీట్‌పై స్పందించిన అనిల్ ఆర్యన్ అనే ఓ నెటిజన్...డబ్బులు పంచారుగా ఎందుకు గెలవరు సార్ అంటూ స్పందించాడు. నీకు ఎంత ముట్టిందంటూ మరో నెటిజన్..తమ కుటుంబంలోని నలుగురు సభ్యులకు టీఆర్ఎస్ నుంచి రూ.8 వేలు, సీపీఎం నుంచి రూ.4 వేలు ముట్టిందని చెప్పుకొచ్చాడు. నెటిజన్ చేసిన కామెంట్స్‌లో ఎంత వరకు వాస్తవమో తెలియడ లేదు. అయితే ఆ నెటిజన్ కామెంట్‌పై మంత్రి కేటీఆర్ మాత్రం ప్రతిస్పందించలేదు.

మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు ఓటర్లను తీవ్ర ప్రలోభాలకు గురిచేశాయన్న ఆరోపణలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నుద్దేశించి ఓ నెటిజన్ చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారింది.
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు