Voter Slip Download: ఎల్లుండి మునిసిపల్ పోలింగ్... ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయండి ఇలా

Telangana Municipal Elections Voter Slip Download | ఓటర్ ఐడీతో ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ వార్డులోని మొత్తం ఓటర్ స్లిప్స్‌ని ఒకేసారి డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఓటర్ స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.

news18-telugu
Updated: January 20, 2020, 11:38 AM IST
Voter Slip Download: ఎల్లుండి మునిసిపల్ పోలింగ్... ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి ఊపందుకుంది. జనవరి 22న పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలనుకునేవారంతా ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. https://tsec.gov.in/ వెబ్‌సైట్‌లో ఓటర్ స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. ఓటర్ ఐడీతో ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ వార్డులోని మొత్తం ఓటర్ స్లిప్స్‌ని ఒకేసారి డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఓటర్ స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి.

Telangana Municipal Elections: నేరుగా ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయండి ఇలా



ముందుగా https://tsec.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో DOWNLOAD VOTER SLIP లింక్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మీ జిల్లా పేరును ఎంచుకోండి.
EPIC నెంబర్ ఎంటర్ చేయండి.
క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత Search Voter పైన క్లిక్ చేయండి.మీ ఓటర్ స్లిప్ ఓపెన్ అవుతుంది.
ఓటర్ స్లిప్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Telangana Municipal Elections: మీ వార్డులోని ఓటర్ల జాబితా డౌన్‌లోడ్ చేయండి ఇలా


ముందుగా https://tsec.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో DOWNLOAD ULB WARD WISE ELECTORAL ROLLS లింక్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో జిల్లా పేరు, మునిసిపాలిటీ పేరు వార్డు నెంబర్ ఎంచుకోవాలి.
క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత GET DATA పైన క్లిక్ చేయాలి.
మీ వార్డుకు చెందిన ఓటర్ల జాబితా ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉంటుంది.
మీరు భాష పైన క్లిక్ చేస్తే మీ వార్డులోని ఓటర్లందరి ఓటర్ స్లిప్స్ కనిపిస్తాయి.
అందులో మీ కుటుంబానికి చెందిన ఓటరు జాబితా సెలెక్ట్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు.
ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళ్లేప్పుడు ఓటర్ స్లిప్ తీసుకెళ్లాలి.
వార్డులోని ఓటర్ల జాబితా డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి:

Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.179 ప్లాన్‌తో ఎన్నో లాభాలు

PPF New Rules: మారిన పీపీఎఫ్ రూల్స్‌తో లాభమా... నష్టమా? తెలుసుకోండి

SBI Card: ఒక్క ఎస్ఎంఎస్‌తో మీ ఎస్‌బీఐ కార్డు బ్లాక్ చేయొచ్చు ఇలా
Published by: Santhosh Kumar S
First published: January 20, 2020, 11:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading