తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: మ 12 గం.లకల్లా తేలిపోనున్న ట్రెండ్స్

Telangana Municipal Elections 2020 | తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించి, ఆ తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడుతారు.

news18-telugu
Updated: January 25, 2020, 8:13 AM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: మ 12 గం.లకల్లా తేలిపోనున్న ట్రెండ్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఓట్ల లెక్కింపు మొదలైంది.  ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు చేపట్టి, ఆ తర్వాత బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపడుతారు.  మధ్యాహ్నం 12 గం.ల కల్లా ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపారో తేలిపోనుంది. సాయంత్రానికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడికానున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలు ఇవి

2,647 వార్డు సభ్యులు, 324 కార్పొరేటర్లకు ఎన్నిక

ఎన్నికల బరిలో మొత్తం 12,926 మంది అభ్యర్థులు
మున్సిపాలిటీల్లో 83 వార్డులు(టీఆర్ఎస్-80, ఎంఐఎం-3) ఏకగ్రీవం
ఓట్ల లెక్కింపు విధుల్లో 10 వేల మంది సిబ్బంది
ఓట్ల లెక్కింపు కోసం 2,619 టేబుళ్ల ఏర్పాటు
5 నుంచి 24 రౌండ్లలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుమొదట పోస్టల్ ఓట్లు, ఆ తర్వాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
సమాన ఓట్లు వస్తే లాటరీ పద్ధతిలో విజేత ప్రకటన
27న పరోక్ష పద్ధతిలో మేయర్, ఛైర్‌పర్సన్‌ల ఎన్నిక
Published by: Janardhan V
First published: January 25, 2020, 8:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading