Telangana Municipal Elections 2020: సరిలేరు టీఆర్‌ఎస్‌కు ఎవ్వరు...అల తెలంగాణ పుర ఎన్నికల్లో...

కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి అధికార టీఆర్ఎస్ పార్టీ పలు మున్సిపాలిటీల్లో ముందంజలో నిలిచింది. ఇప్పటికే 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

news18-telugu
Updated: January 25, 2020, 3:04 PM IST
Telangana Municipal Elections 2020: సరిలేరు టీఆర్‌ఎస్‌కు ఎవ్వరు...అల తెలంగాణ పుర ఎన్నికల్లో...
Telangana Municipal Elections 2020
  • Share this:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. మొత్తం 120 మున్సిపాలిటీల్లో 110 మున్సిపాలిటీల్లో కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 4 మున్సిపాలిటీలు, బీజేపీ 1 మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే మొత్తం 9 నగరపాలక సంస్థలు, 120 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 9 కార్పోరేషన్లలలో 325 వార్డులు ఉండగా, ఒకటి ఏకగ్రీవం అయ్యింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కార్పోరేషన్ 17వ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు 120 మున్సిపాలిటీల్లో 2727 వార్డుల్లో 80 ఏకగ్రీవం అయ్యాయి. అందులో 77 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిర్మల్ జిల్లా భైంసాలో మూడు వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఫలితాల అప్డేట్స్...
- మొత్తం 2979 వార్డుల్లో టీఆర్ఎస్ 1478 వార్డుల్లో విజయం, కాంగ్రెస్ 488, బీజేపీ 221, ఎంఐఎం 55, ఇతరులు 291 వార్డులు కైవసం

- సిరిసిల్లలో స్వతంత్రుల హవా... టీఆర్‌ఎస్‌ 24 వార్డుల్లో విజయం సాధించగా.. బీజేపీ 3, కాంగ్రెస్‌ 2, స్వతంత్రులు 10 స్థానాల్లో గెలుపొందారు.
- భైంసా మున్సిపాల్టీని కైవసం చేసుకున్న ఎంఐఎం


- బెల్లంపల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- రామగుండంలో హోరాహోరీ పోరు...టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా-నేనా- జగిత్యాల మున్సిపాలిటీపై తొలిసారి గులాబీ జెండా.. 48 స్థానాలకుగాను 30 చోట్ల టీఆర్ఎస్ విజయం
- సంగారెడ్డిలో జగ్గారెడ్డికి షాక్..టీఆర్ఎస్ 15 వార్డులను దక్కించుకుని మునిసిపాలిటీని కైవసం
- 120 మున్సిపాలిటీల్లో 110 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ఆధిక్యం
- హంగ్ దిశగా జనగామ మున్సిపాలిటీ, 30 వార్డుల్లో 13 టీఆర్ఎస్, 10 కాంగ్రెస్, బీజేపీ 7 వార్డుల్లో గెలుపు
- పరిగిలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో ముందంజ.
- తాండూరు 34 వ వార్డులో టీజేఎస్ అభ్యర్థి విజయం. ఇల్లెందు 9వ వార్డులో న్యూ డెమోక్రసీ అభ్యర్థి గెలుపు,
- మెట్ పల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- కొడంగల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- దుబ్బాక మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఆధిక్యం
- కోస్గి, జనగాం మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం
- మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- బడంగ్ పేట్‌లో 4వార్డు టీఆర్ఎస్, 2వార్డు కాంగ్రెస్, 1వార్డు బీజేపీ విజయం
- వడ్డేపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
- వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- హుస్నాబాద్ మున్సిపాలిటీలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు
- చొప్పదండి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- మహబూబాబాద్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- ఆర్మూర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- కొల్లాపూర్, ఐజా మున్సిపాలిటీ జూపల్లి కృష్ణారావు రెబల్స్ విజయం
- తూముకుంట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- ఆలేరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- టీఆర్ఎస్ కు షాక్...నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
- యాదాద్రి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
- మోత్కూరులో హోరాహోరీ కాంగ్రెస్ ఆధిక్యం
- కొత్తకోట మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- ఐడీఏ బొల్లారంలో 22 వార్డుల్లో 17 వార్డులు టీఆర్ఎస్ కైవసం
- సత్తుపల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- ఆందోల్ జోగిపేట్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో 13 వార్డులు టీఆర్ఎస్ కైవసం
- ఐడీఐ బొల్లారం మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- భీంగల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్, 12 వార్డుల్లో గులాబీ గుబాళింపు
- అలంపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కైవసం
- మరిపెడ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం, 15 వార్డుల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్
- వర్ధన్నపేట్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం, 12 వార్డుల్లో 8 టీఆర్ఎస్ కైవసం
- సత్తుపల్లి మున్సిపాలిటీలో 12 వార్డుల్లో టీఆర్ఎస్ గెలుపు, ఖాతా తెరవని కాంగ్రెస్, బీజేపీ
- డోర్నకల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- ధర్మపురి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం, హోరా హోరీ పోరులో 8 వార్డులు టీఆర్ఎస్, 7 వార్డులు కాంగ్రెస్ విజయం
- మహబూబాబాద్ 33వ వార్డులో టీఆర్ఎస్ విజయం
- పెద్దపల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం
- మధిర 10 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
- శంషాబాద్ 4వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం
- నిర్మల్ 10 వార్డులో టీఆర్ఎస్ గెలుపు, వికారాబాద్ 25వ వార్డులో టీఆర్ఎస్ గెలుపు
- వర్ధన్న పేటలో 8 వార్డుల్లో టీఆర్ఎస్ ముందంజ
- జగిత్యాల 11వ వార్డులో బీజేపీ గెలుపు, రంగారెడ్డి 6వ వార్డు బీజేపీ గెలుపు
- ఖమ్మం 7వ వార్డులో టీఆర్ఎస్ గెలుపు
- దేవరకొండ 13 వార్డులో బీజేపీ అభ్యర్థి విజయం
- వైరా 4,7 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం
- సత్తుపల్లి 10,11,13,16,22వ వార్డుల్లో టీఆర్ఎస్ విజయం
- బాన్సువాడ, మరిపెడ, బొల్లారం మున్సిపాలిటీలు టీఆర్ఎస్ కైవసం
- నల్గొండ జిల్లా దేవరకొండ 10,16 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం
- సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ 6,13వ వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం
- డోర్నకల్ 10 వార్డుల్లో టీఆర్ఎస్ ముందంజ
- రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల 1,2 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, 5 వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు.
- సంగారెడ్డి జిల్లా బొల్లారంలో 17,18 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
- వర్థన్నపేటలో 2,6,8,9 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
- వర్థన్నపేట ఒకటో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
- డోర్నకల్ 9,10,11 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం
- హుజూర్ నగర్ 3వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం
First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు