Telangana Municipal Elections 2020: చలో గోవా...మొదలైన మున్సిపల్ క్యాంపు రాజకీయం

ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలోని శివార్లలోని రిసార్టుల్లో అభ్యర్థులు సేదతీరుతున్నారు. అలాగే వైజాగ్‌తో పాటు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు అభ్యర్థులను తరలించారు.

news18-telugu
Updated: January 25, 2020, 7:46 AM IST
Telangana Municipal Elections 2020: చలో గోవా...మొదలైన మున్సిపల్ క్యాంపు రాజకీయం
Telangana Municipal Elections 2020: చలో గోవా...మొదలైన మున్సిపల్ క్యాంపు రాజకీయం
  • Share this:
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే ఫలితాలు రాక ముందే అన్ని పార్టీలు క్యాంపు రాజకీయాలు ప్రారంభించాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ఇప్పటికే బస్సుల్లో క్యాంపులకు తరలించింది. కాంగ్రెస్, బీజేపీ సైతం తమ అభ్యర్థులను క్యాంపులకు పంపింది. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలోని శివార్లలోని రిసార్టుల్లో అభ్యర్థులు సేదతీరుతున్నారు. అలాగే వైజాగ్‌తో పాటు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు అభ్యర్థులను తరలించారు. ఫలితాలు వెలువడగానే గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లను ఈనెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక కార్యక్రమానికి నేరుగా వచ్చేలా పార్టీలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే ఈ క్యాంపుల ఖర్చును చైర్మన్, మేయర్‌ ఆశావాహులు భరించాల్సి ఉంది. రాష్ట్రంలోని 50 శాతానికి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలిచిన వారు క్యాంపులకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.

First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు