Hyderabad Rains: నేటి నుంచే వరద బాధితులకు సాయం అందజేత... కేటీఆర్ ట్వీట్

కొద్దిరోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు గానూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి ఆర్థిక సాయం అందజేయనుంది.

news18
Updated: October 20, 2020, 1:04 PM IST
Hyderabad Rains: నేటి నుంచే వరద బాధితులకు సాయం అందజేత... కేటీఆర్ ట్వీట్
కేటీఆర్(ఫైల్ ఫోటో)
  • News18
  • Last Updated: October 20, 2020, 1:04 PM IST
  • Share this:
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సూచనల మేరకు హైదరాబాద్, పరిసరాల్లో వరద బాధిత ప్రాంతాల్లోని 3-4 లక్షల కుటుంబాలకు ఈరోజు నుండి రు.10,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయనుంది. బాధిత కుటుంబాలకు వారి ఇంటివద్దకు వెళ్లి అక్కడే ఈ ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర మునిసిపల్ శాఖ సిబ్బంది.. ఈ సాయం అందించనున్నారు. వరద బాధితులకు అవసరమైతే ఆర్థిక సహాయం ఇంకా పెంచడానికి కూడా సిద్ధమని, వర్షాల వల్ల ఇబ్బందిపడ్డ ప్రతి వ్యక్తికి/కుటుంబానికి ఈ సాయం అందాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో తెలంగాణ మునిసపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఈ విపత్కర సమయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇతర ప్రజాప్రతినిధులు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లు, ఎన్జీవోలు కలిసికట్టుగా ప్రజలకు సాయం అందించాలని కోరారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయం అందించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

గడిచిన పదిహేను రోజులుగా భాగ్యనగరంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వర్షాల బారిన పడి వేలాది మంది నిరాశ్రయులయ్యారు.





కాగా, వరద నీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతీ ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. వర్షాలు, వరదల వల్ల ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.

దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించిన విషయం విదితమే.
Published by: Srinivas Munigala
First published: October 20, 2020, 1:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading