Home /News /telangana /

TELANGANA MLC ELECTIONS POLITICAL HEAT IN STATE WHAT IS HAPPENING IN ELECTIONS EVK

Telangana MLC Elections: తెలంగాణ‌లో రాజ‌కీయ వేడీ.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతోంది!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: కాంగ్రెస్‌ను దెబ్బ‌తీసే క్ర‌మంలో విప‌రీతంగా వ‌ల‌స‌ల‌ను ప్రొత్స‌హించిన టీఆర్ఎస్ (TRS) ఇప్పుడు అంత‌ర్గ‌త పోరుతో ఇబ్బంది ప‌డుతోంది. చాలా మంది ప‌ద‌వులు ఆశించే వారి సంఖ్య పెరిగింది. అంద‌రికీ ప‌దవులు అందించ‌డం సాధ్యం కాదు. దీంతో త‌మ‌కు లాభం ద‌క్క‌డం లేద‌ని పార్టీపై గుర్రుగా ఉంటున్నారు.

ఇంకా చదవండి ...
  తెలంగాణ (Telangana)లో ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC Elections) అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాలుగా మారాయి. ఎమ్మెల్సీ కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీల మాదిరిగానే స్థానిక సంస్థల కోటాలోనూ 12 ఎమ్మెల్సీలను ఏకగ్రీవం చేసుకోడానికి గులాబీ దళం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. 12లో కేవలం ఆరు స్థానాల్లోనే టీఆర్ఎస్ ఏకగ్రీవం ఖరారుకాగా, మిగిలిన 6 స్థానాల్లో మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే హుజూరాబాద్ ఓట‌మి త‌రువాత టీఆర్ఎస్‌ను దెబ్బ‌తీసేందుకు ప్ర‌తిప‌క్షాలు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్‌ (Congress)ను దెబ్బ‌తీసే క్ర‌మంలో విప‌రీతంగా వ‌ల‌స‌ల‌ను ప్రొత్స‌హించిన టీఆర్ఎస్ (TRS) ఇప్పుడు అంత‌ర్గ‌త పోరుతో ఇబ్బంది ప‌డుతోంది. చాలా మంది ప‌ద‌వులు ఆశించే వారి సంఖ్య పెరిగింది. అంద‌రికీ ప‌దవులు అందించ‌డం సాధ్యం కాదు. దీంతో త‌మ‌కు లాభం ద‌క్క‌డం లేద‌ని పార్టీపై గుర్రుగా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేళ గట్టు రామచంద్రరావు, సర్దార్‌ రవీందర్‌ సింగ్ టీఆర్ఎస్‌కు దూరం అయ్యారు. ఇంకా చాలా మంది అసంతృప్తులు ఉన్నారు. వారిని త‌మ‌వైపు తిప్పుకొనేంద‌కు బీజేపీ పావులు క‌దుపుతోంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

  అదును కోసం బీజేపీ చూపు..
  కేసీఆర్‌ను స‌వాలు చేసి గెలిచి ఈట‌ల రాజేంద‌ర్ కూడా త‌న స‌త్తా చాట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే ఒక స్థానంలో టీఆర్ఎస్‌ను ఓడిస్తామ‌ని ఆయ‌న అన్నారు.

  HAL Recruitment 2021: హెచ్ఏఎల్‌లో పారామెడిక‌ల్ స్టాఫ్ ఉద్యోగాలు.. జీతం రూ.21,473


  ఇదే జ‌రిగితే చాలా మంది పార్టీ వీడే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. తాజాగా బీజేపీ ఇంచార్జ్‌ తరుణ్‌ చుగ్ వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన ముఖ్యనేతలు 25 మంది బీజేపీకి టచ్‌లో ఉన్నారని అన్నారు. దీన్నిబట్టి రాజకీయ వర్గాల్లో పార్టీ మారే వారి గురించి జరుగుతున్న చర్చ నిజమేనని అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ 80 స్థానాలు గెలుచుకుంటుందని తరుణ్‌ చుగ్ అన్నారు. దీంతో బీజేపీ ఏమైన ప్ర‌ణాళిక వేస్తుందా.. లేదా సాధార‌ణ విమ‌ర్శేనా అనేది ఇంకా అంతుబ‌ట్ట‌డం లేదు.

  ఇప్ప‌టికే ఢిల్లీలో కేసీఆర్‌కు అపాయింట్‌మెంట్ దొర‌క్క‌పోవ‌డం. వ‌రి విష‌యంలో రైతు వ్య‌తిరేఖ‌త వంటి అంశాలు టీఆర్ఎస్‌ను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌రైన స‌మ‌యంలో చూసి టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాల‌ని బీజేపీ చూస్తోంద‌ని స‌మాచారం.

  టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడొక సరికొత్త వర్గం పుట్టుకొచ్చింది. ఇప్పటిదాకా పార్టీలో.. ఉద్యమ తెలంగాణ (యూటీ) బ్యాచ్ , బంగారు తెలంగాణ (బీటీ) బ్యాచ్ కాకుండా కొత్తగా మెయింటనెన్స్ బ్యాచ్(ఎంటీ) కూడా మొదలయిందని, తప్పుడు పద్దతులు, అక్రమ మార్గాల్లో ఎన్నికలను మేనేజ్ చేయడమే ఈ కొత్త బ్యాచ్ పని అని, కరీంనగర్ లో ఎమ్మెల్సీ స్థానానికి తన నామినేషన్ ను కూడా అడ్డుకోవాలని ఈ బ్యాచ్ తీవ్రంగా ప్రయత్నించిందని కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. ఒక‌ప్పుడు ఎన్నిక‌లంటే టీఆర్ఎస్ అస‌లు ప‌ట్టించుకొనేది కాదు. ఏ ఎన్నికైన టీఆర్ఎస్ గెలుపు ఖాయంలా ఉండేది. ఇప్పుడు ఆ ప‌రిస్థితి లేదు. ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే క‌ష్ట‌ప‌డ‌క త‌ప్ప‌డం లేదు. ఎంత‌క క‌ష్ట‌ప‌డ్డా ప్ర‌జ‌లు ఎలా స్పందిస్తారో ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేక పోతున్నారు.
  Published by:Sharath Chandra
  First published:

  Tags: Bjp, Mlc elections, Telangana, Telangana mlc election, Trs

  తదుపరి వార్తలు