హోమ్ /వార్తలు /తెలంగాణ /

Jaggareddy : చంద్రబాబుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు..ఆయన ఏమన్నారంటే..

Jaggareddy : చంద్రబాబుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దతు..ఆయన ఏమన్నారంటే..

jaggareddy

jaggareddy

Jaggareddy : మాజీ ముఖ్యమంత్రి టీడీపి అధినేత చంద్రబాబు ఉదంతంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. చంద్రబాబుకు సభలో జరిగిన అన్యాయాన్ని తాను ఖండిస్తున్నట్టు చెప్పారు.

  ఏపీ అసెంబ్లీలో శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలతో టీడిపి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. మరోవైపు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే బాలక్రిష్ణతో సహా, జూనియర్ ఎన్టీఆర్‌లు సైతం వైసీపీతో పాటు సీఎం జగన్‌ను టార్గెట్ చేయడంతో విషయం కాస్త తెలంగాణకు సైతం పాకింది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( chandrababu naidu )ఏకంగా మీడియా ముందే ఏడ్వడంతో ఉద్వేగ వాతవరణం నెలకొంది. దీంతో ఆయనకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నుండే కాకుండా ఇతర పార్టీల నుండి మద్దతు లభిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుండి మద్దతు లభించింది.

  ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీలో నిన్న చోటుచేసుకున్న ఘటనలపై తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి ( Jaggareddy )స్పందించారు. టీడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జగన్‌ టీం చేసిన అవమానాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబును ఓసారి వైఎస్‌ ఒకమాట అని.. రికార్డుల నుంచి తొలగించాలన్నారని గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో దూషణలు చూడలేదన్న జగ్గారెడ్డి.. ఆయన కన్నీరు పెట్టుకోవడం తనకు ఇబ్బందిగా అనిపించిందన్నారు.

  ఇది చదవండి : జాతకాలు కలవలేదని పెళ్లి రద్దు... అంతకుముందే అమ్మాయితో లైంగిక సంబంధం.. ఆ తర్వాత కథ వేరైంది..


  ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు మరిచిపోయి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరైన సంప్రదాయం కాదన్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని,.. రాజకీయాల్లో విలువలను పరిరక్షించాలన్నారు. వైకాపా నేతల ప్రవర్తన సమాజానికి చెడు సంకేతాలను పంపిస్తోందని హితబోధ చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేననీ.. పార్టీకి ఎలాంటి సంబంధంలేదని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికల్లో బాబు గెలిస్తే.. నీ పరిస్థితి ఏంటి జగన్‌? అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజాస్వామ్యంలేని పాలన ఉన్నట్టు అనిపిస్తోందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

  ఇది చదవండి : ఆయన కలెక్టరే అయినా.. పిల్లలు మాత్రం అంగన్‌వాడి స్కూళ్లో..

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Chandrababu Naidu, Jaggareddy

  ఉత్తమ కథలు