హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : అవును..నిజమే...సీఎం జగన్ నీటిదొంగ...మరో మంత్రి హట్‌ కామెంట్స్

Hyderabad : అవును..నిజమే...సీఎం జగన్ నీటిదొంగ...మరో మంత్రి హట్‌ కామెంట్స్

(పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్)

(పువ్వాడ అజయ్ కుమార్ (ఫైల్)

Hyderabad :రెండు రాష్ట్రాల మధ్య నీళ్ల వివాదం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. కృష్ణానదిపై ఏపి అక్రమ ప్రాజెక్టులను నిర్మాణం చేస్తుందని తెలంగాణ మంత్రులు తీవ్రంగా విరుచుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం జగన్‌మొహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను మరో మంత్రి పువ్వాడ అజయ్ సమర్ధించారు.

ఇంకా చదవండి ...

కృష్ణానది నీటి ప్రాజెక్టులపై రెండు రాష్ట్రాల మధ్య గత కొద్దిరోజులుగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే..దీంతో తెలంగాణ మంత్రులు వరసపెట్టి ఏపీ ప్రాజెక్టులపై తీవ్రంగా మండిపడుతున్నారు. రెండు ప్రభుత్వాలు ఎప్పుడు లేనట్టుగా ఒక్కసారిగా తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు ఏపీ సీఎం జగన్‌మొహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్‌ నీటి అయితే...ప్రస్తుత ముఖ్యమంత్రి గజదొంగ అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఈ నేపథ్యంలోనే నేడు మరో ఇద్దరు మంత్రులు కూడా ఏపి ప్రాజెక్టులపై విమర్శలు చేసేందుకు క్యూ కట్టారు. అయతే ఈసారి ఉత్తరాధి జిల్లాల మంత్రులు విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ...మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసిన గజదొంగ వ్యాఖ్యలను తాను సమర్దిస్తున్నానని స్పష్టం చేశారు. ఏపి ప్రాజెక్టులను అడ్డుకుని తీరుతామాని హెచ్చరించారు.


ఓవైపు సీఎం కేసిఆర్ ఇరురాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నారని, అందుకే జగన్ సీఎం, అయిన తర్వాత నేరుగా ఇంటికి అహ్వానించారని ఆయన గుర్తుచేశారు. అదే సమయంలో బేసిన్లు, బేషజాలకు పోకుండా గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకుందామని సీఎం కేసిఆర్ ప్రతిపాదించారని చెప్పారు.ఇక ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ గొప్ప ప్రాజెక్టులు కట్టామని చెప్పుకున్నారని అయితే...ఖమ్మం జిల్లాలోని ఒక్క ఎకరానికైనా నీళ్లు వచ్చాయా..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీతారామ ప్రాజెక్టు నిర్మించుకుని రెండు పంటలకు నీరు అందిస్తున్నామని చెప్పారు...

ఇక రెండు రాష్ట్రాల వివాదంపై కేంద్రం ఎందుకు స్పందించలేదని మరో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రం చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.రాష్ట్రానికి ఎగువన ఉన్నామని ఇష్టమొచ్చినట్టు ప్రాజెక్టులు నిర్మిస్తామంటే చూస్తూ..ఊరుకోమని హెచ్చరించారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ కోసం ఒక్క ప్రాజెక్టు కట్టలేదని విమర్శించారు. ఎన్జీటి ఆదేశాలను ఏపి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

First published:

Tags: Ap, Telangana

ఉత్తమ కథలు