Harish Rao: ఎమ్మెల్సీగా కవిత గెలుపుపై హరీశ్‌రావు సంచలన కామెంట్లు.. వాళ్లను టార్గెట్ చేశారా?

Harish Rao Comments: నిజామాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత భారీ మెజార్టీతో గెలవడంతో... హరీశ్ రావు సంచలన కామెంట్లు చేశారు. అవేంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 12, 2020, 2:30 PM IST
Harish Rao: ఎమ్మెల్సీగా కవిత గెలుపుపై హరీశ్‌రావు సంచలన కామెంట్లు.. వాళ్లను టార్గెట్ చేశారా?
హరీష్ రావు (File)
  • Share this:
Harish Rao Comments: నిజామాబాద్ ఎమ్మెల్సీ బైపోల్స్ రిజల్ట్ టీఆర్ఎస్ పార్టీలో కొత్త ఉత్సాహం తెచ్చింది. అదే సమయంలో... ప్రతిపక్షాల్లో ఉన్న జోష్‌కి కొంత బ్రేక్ వేసింది. కవితకు భారీ మెజార్టీతో విజయం దక్కడంతో... టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. ఇదే సమయంలో... చేగుంట మండలం బాలాజీ గార్డెన్‌లో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీజేపీ వైస్ ఎంపీపీ మున్నూరు రాం చంద్రం... టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా... హరీశ్ రావు... నీరుగారిన ప్రతిపక్షాలకు తన హాట్ కామెంట్లతో సవాల్ విసిరారు. "నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అద్భుతమైన విజయం సాధించింది. కాంగ్రెస్, బీజేపీ డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. రేపు జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇదే తరహా ఫలితాలు ఉంటాయి. కాంగ్రెస్, బీజేపీల అసత్య ప్రచారాలు, సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు అబద్దాలు అని నిజామాబాద్ ఎన్నికలతో తేలింది. మొన్న హుజూర్ నగర్, నేడు నిజామాబాద్, రేపు దుబ్బాక, ఎల్లుండి GHMC... ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ పార్టీ దే. ఈ పార్టీ పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం నిజామాబాద్ ఎన్నికల ఫలితం" అన్నారు.


Nizamabad MLC By-polls Result: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కవిత అపూర్వ విజయం సొంతం చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత ఘన విజయం సాధించారు. మొత్తం 824 ఓట్లు ఉండగా... పోలైనవి 823 ఓట్లు. రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. వీటిలో... టీఆర్ఎస్ 728 ఓట్లు గెలుచుకుంది. ఆ తర్వాత బీజేపీ 56 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ 29 ఓట్లు పొందగా... 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. మొత్తానికి కౌంటింగ్ ప్రారంభమైన 2 గంటల్లోనే ఫలితం వెల్లడైంది.

టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు:
ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత భారీ విజయాన్ని సాధించడంతో సంబరాలు చేసుకుంటున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. నిజానికి పార్లమెంట్‌ ఎన్నికలలో ఓటమి తర్వాత 16 నెలలుగా ఆమె ఏ పదవినీ చేపట్టలేదు. ఉప ఎన్నిక షెడ్యూల్‌ వచ్చినప్పుడే టీఆర్‌ఎస్‌ తరఫున కవిత నామినేషన్‌ వేసినప్పుడే గెలుపు ఖాయం అని భావించినా... ఆమెకు భారీ మెజారిటీ వచ్చేలా టీఆర్ఎస్ నేతలంతా కృషి చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఓట్లు చీలకుండా చూశారు. పార్టీ వారితో పాటు ఇతరుల మద్దతు కూడగట్టి భారీగా ఓట్లు పడేటట్లు ప్రయత్నం చేశారు. ఇవాళ కౌంటింగ్‌లో కవితకు అనుకున్న దాని కంటే ఎక్కువ ఓట్లు రావడంతో పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Published by: Krishna Kumar N
First published: October 12, 2020, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading