హోమ్ /వార్తలు /తెలంగాణ /

KT RamaRao: సీఎంగా కేటీఆర్.. తెలంగాణ మంత్రి తలసాని ఏమన్నారంటే..

KT RamaRao: సీఎంగా కేటీఆర్.. తెలంగాణ మంత్రి తలసాని ఏమన్నారంటే..

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

KTR: కేటీఆర్ తెలంగాణ సీఎం అవుతారనే వార్తలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలోనే పదవి నుంచి తప్పుకుని తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయబోతున్నారనే ప్రచారం కొంతకాలంగా ఊపందుకుంది. ఇందుకోసం కేసీఆర్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారని.. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు తెలంగాణ రాజకీయవర్గాల్లో జోరందుకున్నాయి. ఒకప్పుడు ఈ వార్తలపై స్పందించే విషయంలో ఆచితూచి వ్యవహరించే టీఆర్ఎస్ సీనియర్ నేతలు, మంత్రులు... ఇవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే కొన్ని రోజులుగా మాత్రం ఈ రకమైన వార్తలపై మంత్రులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ సీనయిర్ నేత, మంత్రి ఈటల రాజేందర్ కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అని వ్యాఖ్యానించగా.. తాజాగా మరో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సైతం అదే రకంగా స్పందించారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంది అని ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

ఇక ఆరేళ్ళ పరిపాలన సమయంలో సీఎం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ విమర్శలను తలసాని ఖండించారు. కొందరు అవగాహనా లేకుండా కాళేశ్వరంపై మాట్లాడుతున్నారని విమర్శించారు. గత 70 ఏళ్లుగా తెలంగాణ ఎడారిగా ఉందని.. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల కారణంగా పరిస్థితిలో మార్పు వచ్చిందని అన్నారు. బీజేపీ నేతలు తెలంగాణ కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని అన్నారు. కాళేశ్వరంపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

First published:

Tags: KTR, Talasani Srinivas Yadav, Telangana

ఉత్తమ కథలు