చిరంజీవి, నాగార్జునలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ..తెలుగు అగ్ర హీరోలైన చిరంజీవి, నాగార్జున‌లతో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో..

news18-telugu
Updated: February 4, 2020, 8:41 PM IST
చిరంజీవి, నాగార్జునలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ..
చిరంజీవి, నాగార్జునలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Twitter/Photo)
  • Share this:
తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ..తెలుగు అగ్ర హీరోలైన చిరంజీవి, నాగార్జున‌లతో ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో తెలుగు చలన చిత్ర రంగానికి సంబంధించిన పలు విషయాలతో పాటు తాజాగా రాజకీయ అంశాలు వీళ్ల మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ ముగ్గురి భేటికి చిరంజీవి ఇల్లు వేదికైయింది. చిరు ఇంటికే నాగార్జున, తలసాని శ్రీనివాస్ యాదవ్ విచ్చేసారు. మొన్నటి తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంగా టీఆర్ఎస్  ప్రభంజనం వీచడం.. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తలసానిని చిరు, నాగార్జున‌లతో భేటి కమ్మని ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశాల మేరకే తలసాని చిరంజీవి, నాగార్జునలతో సమావేశమయినట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆన్ లైన్ టికెటింగ్ విధానల అమలతో పాటు.. శంషాబాద్ సమీపంలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు స్థలం కేటాయింపు విషయమై చర్చకు వచ్చింది. అంతేకాదు సినీ పరిశ్రమలో 24 విభాగాల కార్మికులు, టెక్నీషన్స్ కు నైపుణ్యం పెంపుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు. చిత్రపురి కాలనీ లో హాస్పిటల్, పాఠశాల నిర్మాణం వంటివి వీరి దృష్టికి వచ్చాయి. అంతేకాదు చిత్రపురి కాలనీలో సినీ కార్మికులకు ఇండ్ల నిర్మాణానికి 10 ఎకరాల స్థలం కేటాయింపు. కల్చరల్ కేంద్రం ఏర్పాటుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2 ఎకరాల స్థలం కేటాయింపుకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. Fdc తరపున సినీ, tv కళాకారులకు గుర్తింపు కార్డుల పంపి. ణీప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సినీ కార్మికులకు అందే విధంగా సవరణ చేయాలన్నారు. అంతేకాదు Esi, గ్రూప్ ఇన్సూరెన్స్ లను అమలు చేయాలన్నారు. అంతేకాదు తెలంగాణ తరుపున సినీ అవార్డుల ప్రధానం తదితర అంశాలపై చర్చకు వచ్చినట్టు సమాచారం. ఒక తలసారి 2 వ వారంలో మరోసారి సినీ ప్రముఖులు, సంబంధిత అధికారులతో సమావేశం కావాలని ఈ భేటిలో నిర్ణయం తీసుకున్నారు.

ts cinematography minister talasani srinivas yadav met tollywood heroes chiranjeevi nagarjuna,chiranjeevi,nagarjuna,nagarjuna akkineni,chiru,telangana minister talasani srinivas yadav,telangana minister talasani srinivas yadav chiranjeevi nagarjuna,megastar chiranjeevi,koratala siva,trs government chiranjeevi nagarjuna,tollywood,telugu cinema,చిరంజీవి,నాగార్జున.తలసాని శ్రీనివాస్ యాదవ్,తలసాని శ్రీనివాస్ యాదవ్,చిరంజీవి నాగార్జునతో తలసాని భేటి,కొరటాల శివ చిరంజీవి
చిరంజీవి, నాగార్జునలతో మంత్రి తలసాని భేటి (Twitter/Photo)


మరోవైపు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్.. బీజేపీ పంచన చేరడం. మరోవైపు చిరంజీవి ఇటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో సన్నిహితంగా మెలగుతూ వస్తున్నారు.  ఈ  నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసానితో చిరంజీవి, నాగార్జున భేటీ కావడం సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకిత్తించింది. చిరంజీవి విషయానికొస్తే.. ప్రస్తుతానికి  చిరంజీవి తన దృష్టిని కేవలం సినిమాలకే పరిమితం చేసారు. మళ్లీ రాజకీయాల వైపు దృష్టిసారింలేదు. ఈ నేపథ్యంలో చిరు.. మరోసారి రాజకీయాలపై దృష్టి మరలుస్తారా అనేది కీలకంగా మారింది. మొత్తంగా రెండు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ ఉన్న ఈ సమయంలో తలసాని.. తెలుగులో సీనియర్ అగ్రనటులైన నాగార్జున, చిరంజీవిని కలవడం ఇపుడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

telangana minister talasani srinivas yadav met tollywood heroes chiranjeevi nagarjuna,chiranjeevi,nagarjuna,nagarjuna akkineni,chiru,telangana minister talasani srinivas yadav,telangana minister talasani srinivas yadav chiranjeevi nagarjuna,megastar chiranjeevi,koratala siva,trs government chiranjeevi nagarjuna,tollywood,telugu cinema,చిరంజీవి,నాగార్జున.తలసాని శ్రీనివాస్ యాదవ్,తలసాని శ్రీనివాస్ యాదవ్,చిరంజీవి నాగార్జునతో తలసాని భేటి,కొరటాల శివ చిరంజీవి
చిరంజీవి, నాగార్జునలతో మంత్రి తలసాని భేటి (Twitter/Photo)




చిరంజీవి విషయానికొస్తే.. సైరా నరసింహారెడ్డి తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దేవాలయల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మరోవైపు నాగార్జున కూాడా కొత్త సాల్మన్ దర్శకత్వంలో ‘వైల్డ్ డాగ్’ సినిమా చేస్తున్నాడు.
First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు