హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ganesh Chaturthi 2022: హైదరాబాద్ లో 6 లక్షల గణేష్ ప్రతిమల పంపిణీ.. ఉత్సవాలపై మంత్రుల సమీక్ష.. వివరాలివే

Ganesh Chaturthi 2022: హైదరాబాద్ లో 6 లక్షల గణేష్ ప్రతిమల పంపిణీ.. ఉత్సవాలపై మంత్రుల సమీక్ష.. వివరాలివే

మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఈనెల 31 నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు (Ganesh Chaturthi 2022) ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) వెల్లడించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈనెల 31 నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాలకు (Ganesh Chaturthi 2022) ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) వెల్లడించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం MCRHRD లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, MLC ప్రభాకర్ రావు, MLA దానం నాగేందర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లో ప్రతీ ఏటా నిర్వహించే గణేష్ ఉత్సవాలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదని చెప్పారు. భక్తులు, ఉత్సవాల నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ సంవత్సరం GHMC ఆధ్వర్యంలో 4 లక్షలు, పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో ఒక లక్ష, HMDA ఆధ్వర్యంలో ఒక లక్ష చొప్పున మొత్తం 6 లక్షల విగ్రహాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

అత్యంత ఆదరణ కలిగిన ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొనేందుకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురికాకుండా R&B శాఖ ఆధ్వర్యంలో బారికేడ్ లను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ నెల 24 వ తేదీన అధికారులతో కలిసి ఖైరతాబాద్ వినాయక మండపాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. అంతేకాకుండా విగ్రహాల నిమజ్జనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 25 పాండ్స్ కు అదనంగా మరో 50 పాండ్స్ ను నిర్మించడం జరిగిందని తెలిపారు. విగ్రహాల ఊరేగింపు నిర్వహించే రహదారులలో అవసరమైన చోట్ల మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.

Nagarkurnool: అందుబాటులోకి వచ్చిన మెడికల్ కళాశాల: ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభం


విగ్రహాల నిమజ్జనం నిర్వహించే ప్రాంతాల్లో క్రేన్ లు, లైటింగ్, జనరేటర్ లు, గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచడం, తదితర అవసరమైన అన్ని ఏర్పాట్లను చేపడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి మండపం వద్ద GHMC సిబ్బంది పారిశుధ్య పనులను నిర్వహిస్తారని అన్నారు. సెప్టెంబర్ 9 వ తేదీన నిర్వహించే గణేష్ నిమజ్జనం రోజున 8 వేల మంది GHMC సిబ్బంది మూడు షిఫ్ట్ లలో విధులు నిర్వహిస్తారని తెలిపారు. అవసరమైన ప్రాంతాలలో ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని, శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు సిబ్బంది ని నిమయమించడం తో పాటు మఫ్టీ, షీ టీం లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు కూడా గణేష్ నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించేలా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అందరు జాతీయ గీతాన్ని ఆలపించారు.

కార్యక్రమంలో విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సునీల్ శర్మ, ఆర్ధిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణా రావు, హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవిగుప్తా, అదనపు DGP జితేందర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రెటరీ నీతూకుమారి ప్రసాద్, పోలీస్ కమిషనర్ లు సీవీ ఆనంద్, మహేష్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, కలెక్టర్ అమయ్ కుమార్, TSSPDCL రఘోత్తంరెడ్డి, కల్చరల్ డైరెక్టర్ హరికృష్ణ, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు భగవంతరావు, రాఘవరెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కి చెందిన నిరంజన్ రెడ్డి, ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు సుదర్శన్, సికింద్రాబాద్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు శీలం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

First published:

Tags: Ganesh Chaturthi​, GHMC, Talasani Srinivas Yadav

ఉత్తమ కథలు