తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్విటర్ వేదికగా అధికార పార్టీపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణలో కల్వకుంట్ల వారి ప్రభుత్వమే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ కలిసిపోతోందని లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీపై మంత్రి తలసాని యాదవ్ ఎదురుదాడికి దిగారు. ఎంఐఎంతో కలుస్తాన్నమంటూ తమపై విమర్శలు చేయడం ఎందుకని.. బీజేపీయే ఎంఐఎంతో కలవచ్చు కదా అని సెటైర్లు వేశారు.
ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు తలసాని శ్రీనివాస్. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 113 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదని చురకలంటించారు. ఇతర పార్టీల వాళ్లు అంటరానివాళ్లనే భావన తమకు ఎప్పుడూ లేదన్నారు తలసాని. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి మాట్లాడితే ప్రజలు ప్రశంసిస్తారని ఆయన సూచించారు. అంతేగానీ టీఆర్ఎస్పై విమర్శలు చేస్తే ఎలాంటి లాభం ఉండదని ఎద్దేవా చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, MIM, Talasani Srinivas Yadav, Telangana, Trs