తెలంగాణ మంత్రి ఔదార్యం.. అనాధ మృతదేహానికి అంతిమ సంస్కారాలు...

తెలంగాణ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తన పెద్దమనుసు చాటుకున్నారు. అనాథ వృద్ధురాలికి దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేయించారు.

news18-telugu
Updated: March 26, 2020, 10:56 PM IST
తెలంగాణ మంత్రి ఔదార్యం.. అనాధ మృతదేహానికి అంతిమ సంస్కారాలు...
అనాధ శవాన్ని ఆంబులెన్స్‌లో ఎక్కించి అంతిమ సంస్కారాలకు పంపుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
  • Share this:
తెలంగాణ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తన పెద్దమనుసు చాటుకున్నారు. అనాథ వృద్ధురాలికి దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేయించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా యాచకురాలు గా జీవనం కొనసాగిస్తున్న యాదమ్మ అనే వృద్ధురాలు అనారోగ్య కారణాలతో గురువారం మృతి చెందింది. అధికారులు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ జిల్లా కేంద్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో కూరగాయల మార్కెట్ల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.  తెలంగాణ చౌరస్తాలో ఒక అనాధ వృద్ధురాలు మృతి చెందిందన్న విషయాన్ని తెలుసుకున్న మంత్రి హుటాహుటిన అక్కడికి వెళ్లి మృతి చెందిన వృద్ధురాలి వివరాలు తెలుసుకున్నారు. ఆమెకు మానసిక వికలాంగుడైన ఒక కుమారుడు కూడా ఉన్నాడని వారిద్దరు కలిసి భిక్షాటనతో జీవనం సాగిస్తూ, రాత్రి కాగానే తెలంగాణ చౌరస్తా ప్రాంతంలో నిద్రిస్తారని మున్సిపల్ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. వృద్ధురాలి వివరాలు తెలుసుకుని చలించిపోయారు. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మున్సిపల్ అధికారులతో ఆమె అంత్యక్రియలకు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. స్వయంగా మంత్రి ఆ అనాథ శవాన్ని అంబులెన్స్ లోకి తీసుకెళ్లి అంత్యక్రియలకు పంపారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు