TRSకీ BJPకీ తేడా అదే... మహిళలతో మంత్రి హరీశ్‌ రావు ఆసక్తికర సంభాషణ

సరిహద్దు మహిళలతో మంత్రి హరీశ్‌ రావు ఆసక్తికర సంభాషణ (image credit- facebook)

తెలంగాణలో మంత్రి హరీశ్ రావు మరోసారి తనేంటో చూపించారు. క్షేత్రస్థాయిపై పట్టున్న ఆయన... తాను తలచుకుంటే స్థానికులను టీఆర్ఎస్ వైపు మళ్లించగలనని మరోసారి ఈ సంభాషణతో నిరూపించారు.

 • Share this:
  మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతలకు పల్లెల్ల నుంచి నగరాల వరకూ ఫాలోయింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ తరహా నేతలు ఏసీ రూముల్లో కంటే... ప్రజల మధ్యే ఎక్కువగా ఉంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా వీలైనన్ని ప్రజా కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. దాంతో ఈ నేతలు చెప్పే మాటల్ని ప్రజలు ఆసక్తిగా వింటారు. వీళ్లు పిలుపు ఇస్తే ప్రజలు వస్తారు. వీళ్లు ఆదేశిస్తే ప్రజలు పాటిస్తారు. అలా ఒక రకమైన బాండ్ ప్రజలతో ఈ నేతలు ఏర్పరచుకుంటారు. అలాంటి వారిలో తెలంగాణలో సీఎం కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రజాదరణ ఉన్న నేతగా మంత్రి హరీశ్ రావును చెప్పుకోవచ్చు. మంత్రిగా ఎన్ని పనులున్నా.. హరీశ్ రావు తరచూ ప్రజల ముందుకు వెళ్తుంటారు. వారితో కలివిడిగా ఉంటూ మాట్లాడుతూ... వారి సమస్యలు తెలుసుంటారు. అలాంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది.

  నిన్న సంగారెడ్డి జిల్లాలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళ్తూ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు అయిన బీదర్ దగ్గర ఓ గ్రామంపై హరీశ్ రావు దృష్టి పడింది. అక్కడ ఆగి రోడ్డు పక్కన పొట్టకూటి పనులు చేసుకుంటున్న మహిళల దగ్గరకు వెళ్లారు. వారితో మంత్రి ఇలా మాట్లాడారు.

  మంత్రి: అమ్మా బాగున్నారా... ఎలా ఉన్నారు‌. మీది ఏ గ్రామం.
  మహిళలు: మేము కర్ణాటక రాష్ట్రం.. బీదర్ జిల్లా... ‌జాంబిగ గ్రామంలోని గామతండా వాసులం.
  మంత్రి: మీకు పెన్షన్స్ ఇస్తోందా మీ ప్రభుత్వం... ఎంత ఇస్తున్నారు?
  మహిళలు: మా ప్రభుత్వం 500 రూపాయలు పెన్షన్ ఇస్తోంది.
  మంత్రి: తెలంగాణ రాష్ట్రంలోని మీ పక్కనే ఉన్న నారాయణఖేడ్‌లో పెన్షన్ ఎంత ఇస్తున్నారో తెలుసా?
  మహిళలు: మా వాళ్లు అక్కడ ఉన్నారు సార్. రూ.2,000 రూపాయలు ఇస్తున్నారు‌.
  మంత్రి: విద్యుత్ ఎంత సేపు ఇస్తున్నారు మీకు?
  రైతు: ఐదారు గంటలు‌ కూడా‌ రావడం‌లేదు. కరెంట్ వస్తూ పోతూ ఉంటుంది. నా ఐదెకరాల పంటకు నీరు పారాలంటే 10 రోజులు పడుతుంది‌‌ సార్.
  మంత్రి: పక్కనే నారాయణ ఖేడ్‌లో కరెంటు ఎలా ఉంది?
  గ్రామస్థులు: సార్ పక్కనే తెలంగాణ గ్రామాలు మాకు కనిపిస్తూనే ఉంచాయి. 24 గంటలు కరెంట్ వస్తోంది. మేం చూస్తూనే ఉన్నాం. మా బాధలు‌ తెలుసుకునే వారే లేరు.
  మంత్రి: అమ్మా ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ సందర్భంగా ప్రభుత్వ సాయం ఏమైనా అందుతుందా
  మహిళలు‌: మాకేమీ ఇవ్వడం‌లేదు.
  మంత్రి: మేం డెలివరీ ‌సందర్భంగా కేసీఆర్ ‌కిట్ అందజేస్తున్నాం.
  మహిళలు: మీ దగ్గర అన్నీ బాగా చేస్తున్నారు సార్.
  మంత్రి: పెళ్లికి ఏమైనా మీకు సాయం చేస్తున్నారా?
  మహిళలు: లేదు సార్. ఏదీ సాయం అందడం లేదు.
  మంత్రి: నారాయణ ఖేడ్‌లో పెళ్లికి సాయం అందుతుందా?
  మహిళలు: మాకు తెలుసు‌సార్ , మా వాళ్లు ఉన్నారు. పెళ్లికి లక్ష రూపాయల సాయం అందుతోంది.
  మంత్రి: మంచి నీటి సౌకర్యం అందుతుందా? ఇంటింటికి తాగు నీరు ఇస్తున్నారా?
  మహిళలు: కిలోమీటర్ దూరం నుంచి ఇక్కడకు వచ్చి నీళ్లు పట్టుకుంటాం సార్. కరెంట్ వస్తే బిందెలతో నీళ్లు తెచ్చుకుంటాం.
  మంత్రి: వ్యవసాయానికి మీ ప్రభుత్వం సాయం చేస్తుందా?
  రైతు: మాకు రూ.6000 మాత్రమే ఇస్తున్నారు‌.
  మంత్రి: మేము ఎకరానికి 5000 రూపాయలు చొప్పున, ఎన్ని ఎకరాలుంటే అన్ని 5000 రూపాయలు ఇస్తున్నాం.

  ఇలా సాగింది సంభాషణ. దీంతో ఆ మహిళలకు తెలంగాణ ప్రభుత్వంలో పథకాలు ఎలా అమలు అవుతున్నదీ, ఎలాంటి ప్రయోజనాలు కలుగుతున్నదీ తెలిసింది. అదే సమయంలో కర్ణాటకకు చెందిన తాము ఎంతలా నష్టపోతున్నదీ వారు గ్రహించారు. ఇలాంటి కారణంగానే కర్ణాటకలోని చాలా సరిహద్దు ప్రాంతాల వారు తమను తెలంగాణలో కలిపేయమని కోరుతున్నారు.

  ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధానంగా తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామంటున్న బీజేపీకి హరీశ్ రావు తన సంభాషణతో చెక్ పెట్టారని నెటిజన్లు అంటున్నారు. మాస్ లీడర్‌గా మరోసారి తనేంటో తెలిసొచ్చేలా చేస్తున్నారని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కొంత మంది మాత్రం తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో కష్టాలున్నాయంటూ కామెంట్స్ ఇస్తున్నారు.

  ఇది కూడా చదవండి: Vastusashtra గోడ గడియారంతో ప్రమాదం... ఎందుకో తెలుసుకోండి

  మొత్తానికి ఈ సంభాషణ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఎవరి అభిప్రాయాలు వారు చెబుతున్నారు.
  Published by:Krishna Kumar N
  First published: