కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం.. పెద్ద మనసు చాటుకున్న మంత్రి

అటుగా వెళ్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమయ్యను గమనించారు. తన కాన్వాయ్‌ని ఆపించి.. నీళ్లు తాగించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తన కాన్వాయ్‌లో భూమయ్యను కరీంగనర్ ఆస్పత్రికి తరలించారు.


Updated: February 14, 2020, 7:39 PM IST
కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదం.. పెద్ద మనసు చాటుకున్న మంత్రి
కొప్పుల ఈశ్వర్
  • Share this:
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ క్షతగాత్రుడిని తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్.. తన కాన్వాయ్‌లో ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఈ ఘటన జరిగింది. ధర్మారం మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కొమ్మ భూమయ్య.. చొప్పదండి-ఆర్నికొండ మార్గంలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమయ్యను గమనించారు. తన కాన్వాయ్‌ని ఆపించి.. నీళ్లు తాగించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తన కాన్వాయ్‌లో భూమయ్యను కరీంగనర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి భూమయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పి.. ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు