వాట్సప్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు పోలీసులు స్పందించాలి...డీజీపీకి మంత్రి సబిత లేఖ..

రాష్ట్రంలోని విద్యార్థినులకు ఆత్మరక్షణ మెలకువలు నేర్పించేందుకు షీటీమ్స్ ద్వారా ఏర్పాట్లు చేయాలని డిజిపికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాశారు.

news18-telugu
Updated: December 2, 2019, 10:56 PM IST
వాట్సప్ ద్వారా వచ్చే ఫిర్యాదులకు పోలీసులు స్పందించాలి...డీజీపీకి మంత్రి సబిత లేఖ..
మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • Share this:
వాట్సాప్, కంట్రోల్ రూమ్, షీటీమ్స్, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో వస్తున్న ఫిర్యాదులపై స్పందించి బాధితులకు పోలీసులు అండగా నిలవాలని సబితా పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యార్థినులకు ఆత్మరక్షణ మెలకువలు నేర్పించేందుకు షీటీమ్స్ ద్వారా ఏర్పాట్లు చేయాలని డిజిపికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి లేఖ రాశారు. విద్యాశాఖ అధికారులు పోలీస్ విభాగంలో సమన్వయం చేసుకోవాలని, సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, అనే విషయంపై విద్యార్థినులను చైతన్య పరచాలని సబితా సూచించారు. షీటీమ్స్ పై, ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెల్ప్ లైన్ల పట్ల పూర్తి అవగాహన కల్పించాలన్నారు. వేధింపులకు గురువుతున్న మహిళలు, కళాశాల విద్యార్థినులు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలి.

First published: December 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...