హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: అందుకే ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండదు.. తెలంగాణ ప్రభుత్వం వివరణ

Telangana: అందుకే ఈసారి గవర్నర్ ప్రసంగం ఉండదు.. తెలంగాణ ప్రభుత్వం వివరణ

Telangana Assembly Session: రాజ్యాంగంపై బీజేపీ వాళ్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. 2004లో రాష్టప్రతి ప్రసంగం లేకుండానే పార్లమెంట్ సమావేశాలు జరిగాయని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

Telangana Assembly Session: రాజ్యాంగంపై బీజేపీ వాళ్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. 2004లో రాష్టప్రతి ప్రసంగం లేకుండానే పార్లమెంట్ సమావేశాలు జరిగాయని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

Telangana Assembly Session: రాజ్యాంగంపై బీజేపీ వాళ్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. 2004లో రాష్టప్రతి ప్రసంగం లేకుండానే పార్లమెంట్ సమావేశాలు జరిగాయని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

  గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈసారి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని.. గవర్నర్‌ను అవమానిస్తోందని బీజేపీ(Bjp) సహా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈ అంశంపై వివరణ ఇచ్చారు. తమ ప్రభుత్వ అభివృద్ధిని గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించాలని అనుకున్నామని.. అలాంటి అవకాశాన్ని పోగొట్టుకోలేమని అన్నారు. సాంకేతిక సమస్య వల్లే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ (governor) ప్రసంగం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. గతంలోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు జరిగాయని వ్యాఖ్యానించారు. ప్రోరోగ్ కానీ సభకు గవర్నర్‌ని పిలవడం సరికాదని అన్నారు.

  బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రారంభించాలని రాజ్యాంగంలో లేదని ప్రశాంత్ రెడ్డి(Prashant Reddy) అన్నారు. బీజేపీ నేతలకు రాజ్యాంగంపై అవగాహన లేదని ఆరోపించారు. ఇప్పుడు జరిగేది కొత్త సెషన్ కాదని... పాత సమావేశాలకు కొనసాగింపు మాత్రమే అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాజ్యాంగంపై బీజేపీ వాళ్లు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. 2004లో రాష్టప్రతి ప్రసంగం లేకుండానే పార్లమెంట్ సమావేశాలు జరిగాయని ప్రశాంత్ రెడ్డి చెప్పారు.

  మార్చి 7 నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6న సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. మార్చి 7న ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు(Harish Rao) శాసనసభలో బడ్జెట్‌ను(Telangana Budget) ప్రవేశపెట్టనున్నారు. సభ ఎన్నిరోజులు జరగాలనేది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. కరోనా సంక్షోభం నుంచి రాష్ట్రం పూర్తిస్థాయిలో కోలుకున్న తరువాత ప్రవేశపెట్టబోయే కావడం.. దళితబంధు(DalithaBandu) వంటి పథకాలకు మరిన్ని నిధులు కేటాయించనున్న బడ్జెట్ కావడంతో.. ఈ బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోందనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, పెరిగిన జీతభత్యాలతో పాటు దళితబంధు వంటి పలు పథకాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.

  Telangana Budget 2022: ఆ రోజు నుంచే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం

  Telangana assembly: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గవర్నర్​ తమిళిసైకి సీఎం కేసీఆర్​ మరో షాక్​..

  వీటితో పాటు నిరుద్యోగ భృతికి సైతం ఈ బడ్జెట్‌లో నిధులను ఎక్కువగానే కేటాయిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి బడ్జెట్‌లో దళితబంధు కోసం 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ గతంలో చెప్పారు. దీంతో ఈసారి బడ్జెట్‌లో దళితబంధు కోసం ఏ మేరకు నిధులు కేటాయిస్తారు ? ఒక్కో నియోజకవర్గంలో ఎంతమందికి ఈ పథకాన్ని అందించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఈసారి బడ్జెట్ రెండు లక్షల 45 వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈసారి బడ్జెట్ సమావేశాలను ఎక్కువ రోజుల నిర్వహించే అవకాశం ఉందని.. బడ్జెట్‌తో పాటు పలు కీలక బిల్లులకు కూడా ఆమోదం లభించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

  First published:

  Tags: Telangana, Telangana Budget 2022

  ఉత్తమ కథలు