Telangana Agriculture : దేశంలో మిన‌ప‌ప్పు కొర‌త ఉంది.. పండించండి కొంటాం: మంత్రి నిరంజ‌న్‌రెడ్డి

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(ఫైల్ ఫొటో)

Telangana Agriculture : దేశ‌వ్యాప్తంగా మినుములు, మిన‌ప‌ప్పు కొర‌త ఉంది.. రైతులు పండిస్తే అవ‌స‌ర‌మైన‌న్నికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండిస్తాం అని తెలంగాణ వ్య‌వ‌సాయ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు.

  • Share this:
    దేశ‌వ్యాప్తంగా మినుములు, మిన‌ప‌ప్పు కొర‌త ఉంది.. రైతులు పండిస్తే అవ‌స‌ర‌మైన‌న్నికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండిస్తాం అని తెలంగాణ (Telangana) వ్య‌వ‌సాయ మంత్రి నిరంజ‌న్‌రెడ్డి అన్నారు. అంతే కాకుండా ఈ యాసంగిలో మినుములు సాగు చేస్తే క్వింటాల్ రూ.6,300ల‌కు కొంటామ‌ని ఆయ‌న అన్నారు. రైతులు మినుములు విరివిగా పండించాల‌ని మంచి డిమాండ్ ఉంద‌ని, ఆయ‌న పేర్కొన్నారు. ఈ అవ‌కాశాన్ని రైతులు (Formers) వ‌దులుకోవ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. ఆయ‌న మార్క్‌ఫెడ్ పాల‌క‌వ‌ర్గ స‌మావేశంలో రైతుల మాట్లాడారు. మినుములుకు మార్కెట్‌ (market)లో మంచి ధ‌ర ఉంద‌ని పేర్కొన్నారు. ఒక వేళ మార్కెట్‌లో ఎంత ధ‌ర ఉన్నా ప్ర‌భుత్వం క్వింటాల్‌కు రూ.6,300 ఇస్తుంద‌ని కావున రైతులు పండించాల‌న్నారు. తెలంగాణ‌లో వ్య‌వ‌సాయానికి మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని పేర్కొన్నారు.

    మినుముల కొర‌త‌..
    దేశ‌వ్యాప్తంగా మినుమ‌లు, మిన‌ప‌ప్పు కొర‌త తీవ్రంగా ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం.. కేంద్ర సంస్థ నాఫెడ్‌ను సంప్ర‌దించింది. మినుముల కొనుగోలుకు నాఫెడ్ రాత పూర్వ‌క హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న వెరుసెన‌గా, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు, వంటి పంట‌ల‌ను సాగు చేయాల‌ని ఆయ‌న రైతుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు.

    Telangana : నెమలి కిరీటాలు.. ఆక‌ట్టుకొనే నృత్యాలు.. గిరిజన గూడాల్లో దండారి సన్నాహాలు


    ఆయిల్ ఫాంకు భవిష్య‌త్‌..
    తెలంగాణ‌లోని అన్ని జిల్లాల్లో ఆయిల్ ఫాం సాగు పెంచేలా చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ముందుగా ఆయిల్‌ఫాం కాంట్రాక్టు తీసుకొన్న కంపెనీలు పామాయిల్ ఉత్ప‌త్తి మిల్లులు నిర్మిస్తే మిగ‌తా రైతులు ఆస‌క్తిగా ముందుకు వ‌స్తార‌ని ఆయ‌న అన్నారు. అధికారులు ఈ విష‌యంపై ప్ర‌త్యేక చొర‌వ చూపాల‌ని ఆయ‌న సూచించారు. ఈ విష‌యంపై ఆయిల్ ఫెడ్ ఎండీ సురేంద‌ర్‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు.

    జిల్లాల వారీగా ఆయిల్ ఫాం సాగుపై ఆస‌క్తి ఉన్న రైతుల‌ను ఎంపిక చేసి భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో సాగు చేస్తున్న ఆయిల్ ఫాంల‌ను చూపించాల‌ని ఆయ‌న పేర్కొన్నారు. దీని ద్వారా రైతుల‌కు ఆయిల్ ఫాం (Oil Form)లో లాభ‌న‌ష్టాలు తెల‌స్తాయని వారూ సాగుకు ఏం చేయాలో ఓ అంచ‌నా వ‌స్తుంద‌ని అన్నారు. వారికి ఆయిల్ ఫాం సాగుపై పూర్తి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని అధికారుల‌కు సూచించారు. ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ఆయిల్ ఫాం సాగును ప్రొత్స‌హిస్తున్నంద‌న కంపెనీలు నాణ్య‌మైన మొక్క‌ల‌ను న‌ర్స‌రీలో పెంచి రైతుల‌కు అందించాల‌ని పేర్కొన్నారు.
    Published by:Sharath Chandra
    First published: