నూతన వ్యవసాయ విప్లవానికి సీఎం కెసిఆర్ నాంది పలికారు...మంత్రి నిరంజన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో నూతన వ్యవసాయ విప్లవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ నాంది పలికారని అన్నారు. సిఎం కెసిఆర్ వ్యవసాయ రంగ అభివృద్దికి చేస్తున్న కృషికి ప్రపంచమంతా తెలంగాణ వైపే చూస్తోందన్నారు.

news18-telugu
Updated: December 14, 2019, 11:12 PM IST
నూతన వ్యవసాయ విప్లవానికి సీఎం కెసిఆర్ నాంది పలికారు...మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి (ఫైల్ చిత్రం)
  • Share this:
ఉమ్మడి రాష్ట్రంలో వలస పాలకులు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వలేదని వ్యవసాయం దండగ అన్నారని, వ్యవసాయం దండగ కాదు పండగ అని ముఖ్యమంత్రి కెసిఆర్ నిరూపించారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన శనివారం జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానంలో నూతనంగా నిర్మించిన వ్యవసాయ కళాశాల భవన సముదాయాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో నూతన వ్యవసాయ విప్లవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ నాంది పలికారని అన్నారు. సిఎం కెసిఆర్ వ్యవసాయ రంగ అభివృద్దికి చేస్తున్న కృషికి ప్రపంచమంతా తెలంగాణ వైపే చూస్తోందన్నారు. వృధాగా పోతున్న గోదావరి నదీ జలాలను వినియోగించుకుని 40 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు సిఎం కెసిఆర్ ఎవరూ చేయని సాహసం చేసి కేవలం మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టును పూర్తి చేసి ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు.

తెలంగాణలోని పంట ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్, డిగ్రీ, పిజి కళాశాలల స్థాపనతో పాటు వెటర్నరీ కళాశాలలు, మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు.

First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>