• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA MINISTER NIRANJAN REDDY KEY COMMENTS ON PADDY PROCUREMENT SU

Telangana: రైతులకు గుడ్ న్యూస్‌.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రి నిరంజన్‌రెడ్డి కీలక ఆదేశాలు..

Telangana: రైతులకు గుడ్ న్యూస్‌.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రి నిరంజన్‌రెడ్డి కీలక ఆదేశాలు..

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(ఫైల్ ఫొటో)

తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.

  • Share this:
    రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి మంత్రి నిరంజన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని సైతం కొంటామని స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా నిచ్చారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. హైదరాబాద్‌లో మంత్రుల నివాస సముదాయం నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో శానిటైజర్ వినియోగించాలన్నారు.

    ప్రకృతివనాలలో చెట్లు ఎండకుండా ఈ రెండు నెలలు సర్పంచులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లందించి కాపాడుకోవాలని మంత్రి కోరారు. ఉపాధిహామీ పనులు వెంటనే ప్రారంభించి వెంటనే కాల్వల పూడికతీత పనులు ప్రారంభించాలన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చివరి ఆయకట్టు రైతులకు ఆఖరుతడికి నీరందించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కరోనా విస్తరణ నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని కోరారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు.

    Buxar Railway Station: షాకింగ్ వీడియో.. రైల్వే స్టేషన్ నుంచి పరుగులు తీసిన ప్రయాణికులు.. కారణమిదే..

    Indian Railways: రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త.. ఇలా చేస్తే మీ జేబుకు చిల్లే..

    కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా.. మంత్రి నిరంజన్‌రెడ్డి
    కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ బారిన పడిన మంత్రి నిరంజన్ ‌రెడ్డి.. తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం కరోనా నుండి పూర్తిగా కోలుకున్నానని .. త్వరలోనే తిరిగి ప్రజాసేవ కోసం ముందుకు వస్తానని తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: