Malla Reddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి.. ఇవాళ హైదరాబాద్.. బషీర్బాగ్ లోని ఆదాయపు పన్ను శాఖ (Income Tax) కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. ఈమధ్య ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇంటితోపాటూ.. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా రెండ్రోజులపాటూ సోదాలు జరిపారు. భారీగా డబ్బుతోపాటూ.. కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సోమవారం విచారణకు హాజరుకావాల్సిందిగా.. మల్లారెడ్డితోపాటూ.. మరో 16 మందికి నోటీసులు ఇచ్చారు. అందులో భాగంగానే మల్లారెడ్డి ఇవాళ వెళ్తారని తెలుస్తోంది.
ఆరోపణలు :
మల్లారెడ్డి ప్రధానంగా.. తమ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో పరిమితికి మించి ఫీజులు, భారీగా డొనేషన్లు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఆ డబ్బును రియాల్టీ సెక్టార్లో పెట్టుబడులుగా పెట్టి.. ఆదాయ పత్రాల్లో చూపించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇవాళ ఐటీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారన్నది రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది.
ఈరోజు మల్లారెడ్డి చెప్పే సమాధానాలను లెక్కలోకి తీసుకొని విశ్లేషించి.. ఆ తర్వాత ఆయన్ను మరో రోజు అధికారులు పిలుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇవాళ మల్లారెడ్డితోపాటూ.. నోటీసులు అందుకున్న మరో 16 మందిని కూడా ప్రశ్నించాలన్నది ఐటీ అధికారుల ఆలోచన. మరి వారిలో ఎంత మంది వస్తారన్నది తేలాల్సిన అంశం. వారంతా చెప్పిన సమాధానాలను బట్టీ.. ఐటీ అధికారులు తమ నెక్ట్స్ కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు.
Weird Pics : అత్యంత అసహజ దృశ్యాలు.. మీరు ఎప్పుడూ చూసి ఉండరు
రాజకీయ కలకలం:
ఐటీ అధికారుల దాడులు ఇక్కడితో అయిపోవనీ.. మున్ముందు మరిన్ని జరుగుతాయని స్వయంగా మల్లారెడ్డే చెబుతున్నారు. అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతున్నారు. అటు సీఎం కేసీఆర్ కూడా ఈ విషయంపై మౌనంగా ఉన్నారు. తాజాగా మీడియా ముందు ఏదీ మాట్లాడకపోయినా.. పార్టీ వర్గాల్లో మాత్రం ఈ వ్యవహారాల్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారని తెలుస్తోంది.
మొత్తంగా తెలంగాణలో ఎన్నో ఆర్థిక, సామాజిక సమస్యలు ఉండగా.. వాటన్నింటినీ మించి.. మంత్రి మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Malla Reddy, Telangana News, Telugu news