Home /News /telangana /

TELANGANA MINISTER KTR TO MONITOR VACCINATION MEDICINES SITUATION IN STATE AK

KT RamaRao: మంత్రి కేటీఆర్‌కు ‘ఈటల’ బాధ్యతలు.. శాఖ అప్పగించకుండానే..

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

కేటీఆర్ (ఫైల్ ఫోటో)

KT RamaRao: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా రోగులకు అందే మందులు, మెడికల్ ఆక్సిజన్ వంటి కీలక అంశాలపై మంత్రి కేటీఆర్ పర్యవేక్షించనున్నారు.

    తెలంగాణలో కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ది రోజుల పాటు లాక్‌డౌన్ విధించింది. ఈ క్రమంలోనే కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత తరుణంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య రంగంపై కరోనా కారణంగా తీవ్ర ఒత్తిడి నెలకొంది. కరోనా రోగులు సరైన వైద్యం, మందులు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇటీవల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ శాఖకు సంబంధించిన బాధ్యతలను మరెవరికీ అప్పగించింది. ప్రస్తుతం ఆ శాఖ బాధ్యతలను స్వయంగా సీఎం కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు.

    సీఎం కేసీఆర్ ఇస్తున్న ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు వైద్య,ఆరోగ్యశాఖకు సంబంధించిన బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖకు సంబంధించిన పలు బాధ్యతలను పరోక్షంగా మంత్రి కేటీఆర్‌కు అప్పగించింది. రాష్ట్రంలో ఏ రోజుకారోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి, సరఫరా చేయడం కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్స్ నియామకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

    పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సీఎంఓ నుండి సీఎం కార్యదర్శి, కోవిడ్ ప్రత్యేకాధికారి రాజశేఖర్ రెడ్డి ఈ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారు. దీన్నిబట్టి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ, కరోనా రోగులకు అందే మందులు, మెడికల్ ఆక్సిజన్ వంటి కీలక అంశాలను మంత్రి కేటీఆర్ పర్యవేక్షించనున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, KTR, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు