New Ration Cards: గుడ్ న్యూస్.. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు.. వెల్లడించిన మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ (ఫైల్)

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లకు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు.

  • Share this:
    తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రం అన్ని రంగాలలో వేగంగా అభివృద్ది చెందుతోందని పురపాలక శాఖ మత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వా పరిస్థితులను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. గతంలో ఏప్రిల్, మే నెలల్లో కరెంటు కోతలుండేవని, కానీ తెలంగాణ వచ్చిన తరువాత ఇపుడు 24 గంటల కరెంటుస్తున్నామని చెప్పారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపేట మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీ‌కారం చుట్టారు. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో అంబేద్క‌ర్ భవనానికి, రూ. 4.5 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ సముదాయాన్ని, రూ. 75 లక్షల వ్యయంతో మార్కెట్ యార్డ్ ఉత్తర భాగం రోడ్డు విస్తరణ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

    అనతరం ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. నాగర్ కర్నూల్ జిల్లాకు నైపుణ్య శిక్షణా కేంద్రం, ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రం, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు హామీ ఇస్తున్నట్లు వెల్లడించారు. 24 గంటల ఉచిత విద్యుత్తు, పెన్షన్లు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను చూడాల‌న్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేసిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి సకల మౌళిక సదుపాయాలు కల్పించి అవసరమైన మేరకు సిబ్బందిని కేటాయించి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

    ఇక, త్వరలోనే రాష్ట్రంలో అర్హులైన పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో పెన్షన్ల కోసం యుద్ధం చేసే పరిస్థితి ఉండేదని కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు.

    కాగా, ఇటీవల వరంగల్ సభలో కూడా కేటీఆర్ త్వరలోనే కొత్త రేషన్ కార్డు, పెనన్షు జారీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు మంజూరు చేస్తారనే చర్చ జరుగుతుంది. కేటీఆర్ స్వయంగా ప్రకటించడంతో లబ్దిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
    Published by:Sumanth Kanukula
    First published: