హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR | Congress: కాంగ్రెస్​ను చులకన చేసిన మంత్రి కేటీఆర్​.. రాహుల్​ను లోపలేసి ప్రశ్నిస్తే అడిగే దిక్కు లేదంటూ ఎద్దేవా..

KTR | Congress: కాంగ్రెస్​ను చులకన చేసిన మంత్రి కేటీఆర్​.. రాహుల్​ను లోపలేసి ప్రశ్నిస్తే అడిగే దిక్కు లేదంటూ ఎద్దేవా..

కేటీఆర్​, రాహుల్ (ఫైల్​ ఫొటోలు)

కేటీఆర్​, రాహుల్ (ఫైల్​ ఫొటోలు)

కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్‌లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని విమర్శించారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని కొల్హాపూర్‌లో బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడారు.

కేంద్రంలోని బీజేపీ (BJP), కాంగ్రెస్‌ (Congress)లపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (Minister KTR) మరోమారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని విమర్శించారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని (Mahbubnagar) కొల్హాపూర్‌లో బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘ కేంద్రం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోంది. బీజేపీ నేతలు దేశాన్ని రావణకాష్టంలాగా మార్చారు. దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 400 నుంచి రూ. 1000 దాటింది. ఒక్క ఛాన్స్ అని రాహుల్ గాంధీ అడుగుతున్నారని.. ప్రజలు ఇప్పటికే కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అధికారం ఇచ్చారని.. అన్నేళ్లు ఏమీ చేయలేని వాళ్లు ఇప్పుడేం చేస్తారని ప్రశ్నించారు. కొల్లాపూర్‌లో సింగోటం నుంచి గ్రావిటీ ద్వారా తీసుకెళ్లే రూ.147 కోట్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు కొల్లాపూర్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు.

కాంగ్రెస్‌కు చరిత్రే మిగిలింది..

కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని విమర్శించారు. రాహుల్ గాంధీని గంటల తరబడి ఈడీ ఆఫీస్‌లో కూర్చోబెట్టినా అడిగేవాడు లేడని (no one even bothered to question Congress MP Rahul Gandhi )అన్నారు. బీజేపీకి మత పిచ్చి తప్ప మరోటి లేదని మండిపడ్డారు. దేశాన్ని రావణకాష్టంగా మార్చిందని విమర్శించారు. మోదీ అధికారంలోకి రాక ముందు సిలిండర్ రూ. 400 ఉండేదని.. ఇప్పుడు సిలిండర్ ధర రూ. 1,050 అయిందని.. మరి ఎవరు అసమర్ధుడని ప్రశ్నించారు. తంబాకు తినడం తప్ప బండి సంజయ్‌కు ఏమి తెలియదని విమర్శించారు. నల్లధనం తెస్తానన్న ప్రధాని నరేంద్ర మోదీ.. నేడు తెల్లముఖం వేశారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇక కాలం చెల్లింది. కాంగ్రెస్‌కు చరిత్రే మిగిలింది. రాహుల్‌ గాంధీని గంటల తరబడి ఈడీ ఆఫీసులో కూర్చోబెట్టినా అడిగేవారు లేరు. ఒక్క ఛాన్స్‌ అని రాహుల్‌ గాంధీ అడుగుతున్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికే 50 ఏళ్లు అధికారం ఇచ్చారు. అన్నేళ్లు ఏమీ చేయలేని వాళ్లు ఇప్పుడేం చేస్తారు’’ అని ప్రశ్నించారు.

నియంతృత్వం మాదిరి..

కాగా, అంతకుముందు కూడా కేటీఆర్​ కేంద్రంపై విరుచుకుపడ్డారు. జై జవాన్-జై కిసాన్ అని నినదించిన ఈ దేశంలో మెన్నటిదాకా నల్ల రైతుచట్టాలతో రైతుల గోసగుచ్చుకున్న కేంద్రం, ఇప్పుడు ఈ విధానంతో జవాన్లను (Jawan) నిర్వేదంలోకి నెడుతున్నదని అన్నారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (One Rank One Pension) నుంచి ఆర్మీని ఈ రోజు నో ర్యాంక్ –నో పెన్షన్ స్థాయికి దిగజార్చిందని కేటీఆర్(KTR) విమర్శించారు. దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న యువత ఆగ్రహానికి ఆందోళనలకు కేంద్రానిదే పూర్తి బాధ్యత అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనే విషయాన్ని మరిచి ఏకపక్షంగా, నియంతృత్వం మాదిరి ఇలాంటి చర్చలు లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ప్రజలకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు.

First published:

Tags: Bjp, KTR, Mahbubnagar, Rahul Gandhi, Telangana Politics

ఉత్తమ కథలు