కేసీఆర్‌కు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్...అందుకున్న కేటీఆర్

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసినందుకు కేసీఆర్ తరుపున ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.

news18-telugu
Updated: November 17, 2018, 10:31 PM IST
కేసీఆర్‌కు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్...అందుకున్న కేటీఆర్
వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న కేటీఆర్
  • Share this:
కొన్ని రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్‌కు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే అవార్డుల ప్రదానోత్స కార్యక్రమం శనివారం ముంబైలో జరిగింది. కేసీఆర్‌కు వచ్చిన ఆ అవార్డును..ఆయన తరపున మంత్రి కేటీఆర్ అందుకున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ అవార్డును కేటీఆర్‌కు అందజేశారు. కేసీఆర్‌ను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయెల్ పాల్గొన్నారు.

వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. దేశంలో పిన్నవయసు గల తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులతో దేశానికే ఆదర్శంగా నిలవడం గర్వకారణం. టీఎస్‌ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే కొత్త పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నాయి. తెలంగాణలో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. ఈ అవార్డు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం. కేటీఆర్, తెలంగాణ మంత్రి




Published by: Shiva Kumar Addula
First published: November 17, 2018, 10:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading