హోమ్ /వార్తలు /తెలంగాణ /

Minister KTR: కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్​ విమర్శలు.. ఈ సారి నేరుగా సీబీఐ. ఈడీ, ఐటీ సంస్థల తీరుపై..

Minister KTR: కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్​ విమర్శలు.. ఈ సారి నేరుగా సీబీఐ. ఈడీ, ఐటీ సంస్థల తీరుపై..

కేటీఆర్

కేటీఆర్

బీజేపీ సర్కార్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్​ వేదికగా విమర్శలు గుప్పించారు. గత ఎనిమిదేళ్లుగా బీజేపీ నేతలు, వారి మనుషులు, బంధువులపై ఎన్ని ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు జరిగాయని ప్రశ్నించారు.

కేంద్రంలోని బీజేపీ (BJP) సర్కార్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ (Telangana Minister KTR) మరోసారి ట్విట్టర్​ వేదికగా విమర్శలు గుప్పించారు. గత ఎనిమిదేళ్లుగా బీజేపీ నేతలు, వారి మనుషులు, బంధువులపై ఎన్ని ఐటీ (IT), సీబీఐ 9CBI), ఈడీ (ED) దాడులు జరిగాయని ప్రశ్నించారు. బీజేపీ వాళ్లంతా సత్య హరిశ్చంద్రుడి బంధువులా?.. అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. #JustAsking అనే హ్యాష్ ట్యాగ్‌ను జతచేశారు. కాగా, గతకొంతకాలంగా టీఆర్ఎస్‌తో సహా పలు విపక్ష పార్టీలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సమాఖ్య స్పూర్తిని దెబ్బతిస్తోందని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థులను దెబ్బతీయడానికి బీజేపీ జేబు సంస్థగా మార్చుకుందని విమర్శలు చేస్తున్నాయి విపక్ష పార్టీలు.

కొంతకాలంగా కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని.. అప్పులు తెచ్చుకునే విషయంలోనూ కొర్రీలు పెడుతోందని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతకుముందు తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల విషయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రానికి, బీజేపీకి పలుసార్లు సవాళ్లు విసిరారు. గత ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు వెళ్లాయని.. అయితే రాష్ట్రానికి కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని కేటీఆర్ ఆరోపించారు.

ఇది నిజం కాకపోతే తాను రాజీనామా చేస్తానని కూడా ఆయన కేంద్రం, బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ఇది అబద్ధమని నిరూపించకపోతే బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తారా? అని సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు మొత్తం నిధులు కేంద్రమే ఇస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పన్నులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.

3 ల‌క్ష‌ల 65 వేల 797 కోట్లు..

కేంద్రానికి ప‌న్నుల రూపంలో తెలంగాణ క‌ట్టింది.. రూ. 3 ల‌క్ష‌ల 65 వేల 797 కోట్లు.. కానీ తిరిగి వ‌చ్చింది కేవ‌లం రూ. ల‌క్షా 68 వేల కోట్లు మాత్ర‌మే అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. రాజ్యాంగం ప్ర‌కారం, ఫైనాన్స్ క‌మిష‌న్ ప్ర‌కారం కేంద్రం నిధులు ఇస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణ‌కు అద‌నంగా ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇక తెలంగాణకు 3.9 లక్షలు కేంద్రం ఇచ్చిందని బీజేపీ ఎంపీ మాట్లాడుతారని... అరవింద్​పై ధ్వజమెత్తారు. తుక్కుగూడ సభలో అమిత్​ షా మాత్రం రూ.2.5 లక్షల కోట్లు ఇచ్చామని అన్నారని గుర్తుచేశారు. ఇలాంటి అబద్దాలు ఎన్ని రోజులు చెబుతారని మండిపడ్డారు కేటీఆర్​. తెలంగాణకు దాదాపు 1 లక్ష కోట్లకు కేంద్రం నుంచి రావాల్సి ఉందని అన్నారు.

First published:

Tags: Bjp, CBI, Enforcement Directorate, IT raids, Minister, Minister ktr

ఉత్తమ కథలు