హైదరాబాద్‌లో చకచకా రోడ్డు పనులు.. రైల్వే అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ..

హైదరాబాద్‌లో జరుగుతున్న రోడ్డు పనులకు సంబంధించి రైల్వే శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.

news18-telugu
Updated: May 4, 2020, 1:58 PM IST
హైదరాబాద్‌లో చకచకా రోడ్డు పనులు.. రైల్వే అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ..
మంత్రి కేటీఆర్ (File)
  • Share this:
లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం.. హైదరాబాద్‌లో రోడ్డు పనులను చేపట్టింది. ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా.. నాలా పనులు, రోడ్డు విస్తరణ, సిమెంట్ రోడ్లు.. ఇలా పలు అభివృద్ధి పనులను చేపట్టింది. కాగా, హైదరాబాద్‌లో జరుగుతున్న రోడ్డు పనులకు సంబంధించి రైల్వే శాఖ అధికారులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. పలుచోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి రైల్వే, రైల్వే అండర్ బ్రిడ్జిలకు సంబంధించి పనులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ పనులను త్వరగా పూర్తి చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. నగరంలో జరుగుతున్న ఆర్వోబీ, ఆర్‌యూబీల వారీగా సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ రోడ్డు వర్కులతోపాటు హైదరాబాద్ జలమండలికి సంబంధించిన కొన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన పనులు కూడా దక్షిణ మధ్య రైల్వేతో జతకూడి ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా సమావేశంలో మంత్రి చర్చించారు.

రైల్వే శాఖ కూడా జీహెచ్ఎంసీ మాదిరి వేగంగా పనులను పూర్తిచేసి నగర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా చూడాలని మంత్రి కేటీఆర్ కోరారు. అటు.. వచ్చే వర్షాకాలం లోపల సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల రైల్వేకు సంబంధించిన పనులను పూర్తిచేసే దిశగా ప్రణాళికలు రూపొందించాలని జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు. కాగా, అవసరమైన అనుమతులు, ఇతర పనులకు తమ వైపు నుంచి పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఈ సమావేశానికినగర మేయర్ బొంతు రామ్మోహన్, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజనన్ మాల్య, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లొకేశ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: May 4, 2020, 1:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading