కేటీఆర్, ఉత్తమ్ మధ్య 'డిష్ వాష్' డిష్యుం..!

తాము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, అమెరికాలో కేటీఆర్ గిన్నెలు కడిగేవారన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనదైన శైలిలో పీసీసీ చీఫ్‌పై సెటైర్లు వేశారు

news18-telugu
Updated: September 8, 2018, 12:24 PM IST
కేటీఆర్, ఉత్తమ్ మధ్య 'డిష్ వాష్' డిష్యుం..!
ఉత్తమ్, కేటీఆర్
news18-telugu
Updated: September 8, 2018, 12:24 PM IST
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోవడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. పరస్పరం ఆరోపణలు, వ్యక్తిగత దూషణలతో రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నారు. తాము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, అమెరికాలో కేటీఆర్ అంట్లు తోముకునేవారన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనదైన శైలిలో పీసీసీ చీఫ్‌పై సెటైర్లు వేశారు.

ఉత్తమ్ గారు..! నేను అమెరికాలో నిజంగానే గిన్నెలు కడిగాను. నేనే కాదు..అక్కడ ఉండే భారతీయులంతా ఎవరి పని వాళ్లు చేసుకుంటారు. నేను చేసిన పని పట్ల గర్వపడుతున్నా.  నా పని చేసుకొని గౌరవంగా బతికా. సంపాదించా.  కానీ ఎప్పుడూ మీ పప్పు (రాహుల్ గాంధీ)లా జీవించలేదు. నీలా ప్రజల సొమ్మును దోచుకొని కారులో తగులబెట్టలేదు.
ట్విటర్‌లో కేటీఆర్
ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ కేటీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేకుంటే అమెరికాలో గిన్నెలు కడుక్కుంటూ ఉండేవారని విమర్శించారు.
మేం రాజకీయాల్లో ఉన్నప్పుడూ అమెరికాలో కేటీఆర్ గిన్నెలు కడిగేవారు. తండ్రి కేసీఆర్ ప్రభావితం చేయడం వల్లే కేటీఆర్ ఇండియాకు వచ్చారు. మంత్రిగా పనిచేసే గౌరవం, అర్హత కేటీఆర్‌కు లేదు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్


గత ఎన్నికల సమయంలో ఉత్తమ్ కారులో ఏకంగా రూ.2.5 కోట్లు నగదు కాలిపోవడం వివాదాస్పదమైంది. ఓటర్లు పంచేందుకు ఆ డబ్బును తీసుకెళ్లారని టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. అదే విషయాన్ని ఇప్పుడు మరోసారి ప్రస్తావించారు కేటీఆర్. కాగా, కొంత కాలంగా ఇరువురి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
తెలంగాణలో ఎన్నికలకు సర్వం సిద్ధమవడంతో అది మరింత ముదిరింది.
First published: September 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...