Telangana: కరోనా 2DG డ్రగ్‌పై మంత్రి కేటీఆర్ క్లారిటీ.. మోసపోవద్దని హెచ్చరిక

DRDO 2DG Drug విడుదల చేసిన కేంద్రమంత్రులు.

Telangana: 2DG రెడ్డీస్ ల్యాబ్స్ విడుదల చేసిన ప్రకటనను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఈ డ్రగ్ విషయంలో ఎవరూ మోసపోవద్దని సూచించారు.

  • Share this:
    కరోనా బాధితుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త మందులు మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే కరోనా రోగులకు ఆశాకిరణంగా కనిపిస్తున్న మరో ఔషధం డీఆర్‌డీవో, రెడ్డీస్ ల్యాడ్స్ సంయుక్తంగా తయారు చేసిన 2DG (2 డిఆక్సీ డీ గ్లూకోజ్) డ్రగ్. ఇటీవల కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ దీన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఈ 2DG కోసం కరోనా బాధితులు, వారి బంధువులు నుంచి విజ్ఞప్తులు ఎక్కువమయ్యాయి. కొందరు నేరుగా మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసి ఈ డ్రగ్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

    అసలు 2DG గురించిన వాస్తవ పరిస్థితిని వివరించారు. దీనిపై రెడ్డీస్ ల్యాబ్స్ చేసిన ప్రకటనను ట్విట్టర్ ద్వారా ప్రజల ముందుకు తీసుకొచ్చారు. 2DG డ్రగ్‌ను ఇంకా మార్కెట్‌లోకి తీసుకురాలేదని రెడ్డీస్ ల్యాబ్స్ ఈ ప్రకటనలో పేర్కొంది. జూన్‌లో ఈ డ్రగ్ మార్కెట్‌లోకి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు అందుబాటులోకి ఉండొచ్చని తెలిపింది. దీని ధర ఎంతనే విషయాన్ని కూడా త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. ఇక 2DG డ్రగ్‌ అమ్ముతామని చెబుతున్న కొందరు ఏజెంట్ల మాటలు నమ్మొద్దని కంపెనీ పేర్కొంది. ఈ డ్రగ్ పేరుతో కొందరు అక్రమ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని హెచ్చరించింది. సోషల్ మీడియాలో దీనిపై వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించింది.



    కరోనా బారిన పడిన వారిలో మోడరేట్ నుంచి సీవియర్ పరిస్థితి ఉన్న వారికి ఈ డ్రగ్ ఇవ్వొచ్చని ప్రకటించారు. దీని ద్వారా బాధితులకు ఆక్సిజన్ అందించే పరిస్థితి నుంచి తొందరగా విముక్తి కలుగుతుందని.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ కూడా తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. దీనిపై రెడ్డీస్ ల్యాబ్స్ విడుదల చేసిన ప్రకటనను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.. ఈ డ్రగ్ విషయంలో ఎవరూ మోసపోవద్దని సూచించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: