రానున్న ఐదేళ్లలో తెలంగాణలో 7 వేల కిలోమీటర్ల రోడ్ కనెక్టివిటీ...మంత్రి కేటీఆర్

ఐదేళ్లలో 7 వేల కిలోమీటర్ల రోడ్ కనెక్టివిటీ పెంచి రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. 2014 సంవత్సరంలో 2400 మెగావాట్ల విద్యుత్ కొరతకు అధిగమించగలిగామని, విద్యుత్ అంశంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించామన్నారు.

news18-telugu
Updated: November 26, 2019, 10:59 PM IST
రానున్న ఐదేళ్లలో తెలంగాణలో 7 వేల కిలోమీటర్ల రోడ్ కనెక్టివిటీ...మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్
  • Share this:
ఢిల్లీలో జరిగిన క్రిసిల్స్ ఇండియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ కాంక్లేవ్ లో పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, పెట్టుబడులను సమీకరించడంలో తెలంగాణ రాష్ట్రం అనుసరించిన విధానాలను కెటిఆర్ వివరించారు. ఇన్నోవేషన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్, ఇంక్లుజన్ అంశాలపై రాష్ట్రం దృష్టి పెంటిందని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించేందుకు రూ.45 వేల కోట్లు వెచ్చించామని, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు తలమానికామన్నారు. ఐదేళ్లలో 7 వేల కిలోమీటర్ల రోడ్ కనెక్టివిటీ పెంచి రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. 2014 సంవత్సరంలో 2400 మెగావాట్ల విద్యుత్ కొరతకు అధిగమించగలిగామని, విద్యుత్ అంశంలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించామన్నారు. రాష్ట్రంలోని రైతాంగానికి ఉచితంగా కరెంట్ అందిస్తున్నామని మంత్రి కెటిఆర్ సూచించారు.

First published: November 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>