Home /News /telangana /

TELANGANA MINISTER KTR CASTS HIS VOTE IN GRADUATE MLC ELECTIONS AK

Telangana MLC Elections: గ్యాస్ సిలిండర్‌కు మొక్కి వచ్చిన ఓటేశా.. తెలంగాణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన కేటీఆర్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన కేటీఆర్

Telangana MLC Elections: పట్టభద్రులంతా తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

    తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. పోలింగ్ మొదలైన కొద్దిసేపటికే షేక్‌పేట్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి ముందు ఓ మహానుభావుడు చెప్పినట్టు గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టుకుని వచ్చానని అన్నారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మరో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

    మహబుబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో 5,31,268 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,36,256 మంది పురుషులు, 1,94,944 మంది స్రీలు, 68 మంది ఇతరులు ఉన్నారు. అత్యధికంగా మేడ్చల్‌-మల్కాజిగిరిలో 1,31,284 మంది ఓటర్లు ఉండగా, అతి తక్కువగా నారాయణపేట్‌ జిల్లాలో 13,899 మంది మాత్రమే ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 35,510 మంది ఓటర్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 33,924, వన పర్తి జిల్లాలో 21,158, జోగులాంబ-గద్వాల్‌లో 14,876, నారాయణ్‌పేట్‌లో 13,899, రంగారెడ్డి జిల్లాలో 1,44,416, వికారాబాద్‌లో 25,958, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 1,31,284, హైదరాబాద్‌ జిల్లాలో 1,10,243 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో 799 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. వీటిలో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 56, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 44, వనపర్తి జిల్లాలో 31 , జోగులాంబ-గద్వాల్‌లో 22, నారాయణ్‌పేట్‌లో 20, రంగారెడ్డి జిల్లాలో 199, వికారాబాద్‌లో 38, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 198, హైదరాబాద్‌ జిల్లాలో 191 ఉన్నాయి.ఇక నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో 71 మంది ఉన్నారు. అక్కడ 505565 మంది ఓటర్లు ఉండగా 731 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యి సాయంత్రం 4 గంటలకు ముగుస్తాయి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: KTR, Telangana, Telangana mlc election

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు