• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • TELANGANA MINISTER KOPPULA ISHWAR TESTED FOR COVID POSITIVE VB KNR

Corona Positive: తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్ లో చికిత్స..

Corona Positive: తెలంగాణలో మరో మంత్రికి కరోనా పాజిటివ్.. హోం ఐసోలేషన్ లో చికిత్స..

మంత్రి కొప్పుల ఈశ్వర్ (ఫైల్)

Corona Positive: తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. తనలో స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు ఈశ్వర్ తెలిపారు. ఈ పరీక్షల్లో తనకు పాజిటివ్ నిర్థారణ అయిందని ఆయన వెల్లడించారు.

  • Share this:
    తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. తాజాగా మరో మంత్రికి కరోనా సోకింది. తెలంగాణ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారు. తాజాగా నిర్వహించిన టెస్టులోలో కొప్పుల ఈశ్వర్‌కు కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. ఇటీవలి కాలంలో తనతో సన్నిహితంగా మెలిగినవారు, తనతో కాంటాక్టులో ఉన్న వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, పరీక్షల్లో పాజిటివ్ తేలితే చికిత్స చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని.. వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు కొప్పుల ఈశ్వర్పే ర్కొన్నారు.


    ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు హోంక్వారంటైన్ లో ఉండి చికిత్స చేయించుకుంటున్నట్టు ఆయన చెప్పారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, టిఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా గత కొన్ని రోజుల నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ వరుస ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు