Harish Rao: మంచి మనస్సు చాటిన మంత్రి హరీష్ రావు.. వారిని ఆదుకోవడం కోసం బ్యాంకులో ఇంటి స్థలం తాకట్టు..

హరీష్ రావు (File)

Telangana Minister Harish Rao: మంత్రి తన్నీరు హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో చాలా స్పెషల్. పోటీ చేసిన ప్రతీ సారి మెజార్టీని పెంచుకుంటూ.. ఓటమి ఎరగని నాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఆటో కార్మికులకు అండగా ఉండడం కోసం తాజాగా ఆయన చేసిన పనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

  • Share this:
    మంత్రి తన్నీరు హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో చాలా స్పెషల్. పోటీ చేసిన ప్రతీ సారి మెజార్టీని పెంచుకుంటూ.. ఓటమి ఎరగని నాయకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ఎల్లప్పుడు ప్రజల్లో ఉంటూ ఆయన ప్రత్యేక ఇమేజ్ ను సంపాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు. ప్రజలకు దగ్గరగా ఉండడం, వారితో మమేకమవుతూ కష్టాల్లో తోడుండడమే ఇందుకు కారణం. ఆటో కార్మికులకు అండగా ఉండడం కోసం తాజాగా ఆయన చేసిన పనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల మంత్రి హరీష్ రావుకు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులతో సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేయించాలన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనను ఆయన అమలు చేశారు. సంఘాన్ని ఏర్పాటు చేయించారు. రాష్ట్రంలోనే తొలి ఆటో కార్మికుల పరపతి సంఘంగా ఆ ప్రయత్నం రికార్డు సాధించింది. ఈ సంఘం కోసం సభ్యులు తమ వాటాగా ఒక్కొక్కరు రూ. 1,110 చొప్పున అందించారు. దీంతో మొత్తం రూ. 8.55 లక్షలు జమ అయ్యాయి.

    అయితే సంఘం రిజిస్ట్రేషన్, మిగతా ఖర్చులకు కొంత డబ్బును అందులో నుంచి కేటాయించారు. ఈ ఖర్చులు పోను కొంత డబ్బే మిగిలింది. అయితే మిగిలిన ఆ డబ్బులు మూలధనంగా సరిపోదని అధికారులు తెలిపారు. దీంతో సంఘంలోని ఆటో డ్రైవర్లంతా కలిసి మంత్రి హరీష్ రావును కలిసి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోయారు. అయితే సంఘానికి ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చే మార్గం లేకపోవడంతో మంత్రి సొంతంగా డబ్బులు ఇవ్వాలని నిర్ణయించారు. డబ్బు సమకూర్చుకోవడం కోసం రంగధాంపల్లిలోని తన ఇంటి స్థలాన్ని మంత్రి బ్యాంకులో తాకట్టు పెట్టారు.

    దీంతో వచ్చిన రూ. 45 లక్షలను ఆటో కార్మికుల సహకార పరపతి సంఘం మూలధనంగా జమ చేయించారు. మంత్రి చేయూతతో రూ. 53 లక్షల మూలధనంతో ఆ సంఘం విజయవంతంగా ఏర్పాటైంది. మంత్రి నిర్ణయంతో ఆటో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. హరీశన్నకు రుణ పడి ఉంటామంటూ భావోద్వేగానికి గురవుతున్నాయి. ఈ వార్త వైరల్ గా మారడంతో సిద్దిపేట ప్రజలు హరీష్ రావుపై మరో సారి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: