Home /News /telangana /

Eetala Vs Harishrao: ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే..

Eetala Vs Harishrao: ఈటల రాజేందర్‌పై మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం.. ఏమన్నారంటే..

హరీష్ రావు, ఈటల రాజేందర్

హరీష్ రావు, ఈటల రాజేందర్

సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు.. తన గురువు, రాజకీయ మార్గదర్శి అని అన్నారు హరీష్ రావు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటానని తెలిపారు.

    టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్‌పై ఆ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. రాజీనామా సందర్భంగా సీఎం కేసీఆర్‌పై ఈటల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆత్మగౌరవం కోసం కాదు.. ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలోకి వెళ్తున్నారని నిన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి,  గువ్వల బాలరాజు, సత్యవతి రాథోడ్ విమర్శించారు. తాజాగా మంత్రి హరీష్ రావు సైతం ఈటల రాజేందర్‌పై విరుచుకుపడ్డారు. పార్టీకి ఈటల చేసిన దానికన్నా.. పార్టీయే ఆయనకు ఎక్కువ చేసిందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్‌లో హరీష్ రావుకు కూడా అవమానం జరిగిందన్న ఈటల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

    ''నేను టీఆర్ఎస్‌లో నిబద్ధత, విధేయత కలిగిన కార్యకర్తను. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడడం ఆయన ఇష్టం.  దానికి అనేక కారణాలు ఉండొచ్చు. తాచెడ్డ కోతి వనమల్లా చెరిచిందన్న చెందంగా ఆయన వైఖరి ఉంది. పార్టీకి ఈటల చేసిన సేవ కన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ. ఈటల వెళ్లిపోవడం వల్లే పార్టీకి ఎలాంటి నష్టం లేదు. తన సమస్యలు, నైతిక బలం కోసం నా గురించి ప్రస్తావించారు. పదే పదే నా పేరు ప్రస్తావించడం ఆయన విజ్ఞత, విచక్షణలేమికి నిదర్శనం. నాపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. నా భుజాలపై తుపాకీ పెట్టాలనుకోవడం విఫల యత్నం. వికార ప్రయత్నం.'' అని ఈటలపై హరీష్ రావు మండిపడ్డారు.

    సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు మాత్రమే కాదు.. తన గురువు, రాజకీయ మార్గదర్శి అని అన్నారు హరీష్ రావు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటానని తెలిపారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా నిర్వర్తిస్తానని.. పార్టీ ప్రయోజనాలే నాకు పరమావధని స్పష్టం చేశారు హరీష్ రావు. కాగా, శుక్రవారం శామీర్‌పేటలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. హరీష్ రావు పేరును కూడా ప్రస్తావించారు. ప్రగతి భవన్‌లోకి వెళ్లనీయకుండా తన అవమానించారని.. అది బానిసల భవన్ అని విమర్శించారు. తనకు మాత్రమే కాదు.. హరీష్ రావుకు కూడా ఇలాంటి అవమానాలే ఎదురయ్యాయని తెలిపారు. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలను హరీష్ రావు ఖండించారు.

    మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను తప్పించిన తర్వాత.. టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ హుజురాబాద్ ప్రారంభించింది. అక్కడి నేతలు, కార్యకర్తలు ఎవరూ ఈటల వెంట వెళ్లకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓసారి హుజురాబాద్ నియోజకవర్గ నేతలతో హరీష్ రావు సమావేశమయ్యారు. తాము టీఆర్ఎస్‌లోనే ఉంటామని వారు హరీష్ రావుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాదు హుజురాబాద్ ఉపఎన్నికల బాధ్యతలను కూడా హరీష్ రావుకే అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈటలపై హరీష్ రావు తాజాగా చేసిన విమర్శలు హాట్ టాపిక్‌గా మారాయి.

    ఇవి కూడా చదవండి:

    Eetala Rajender: నాది లెఫ్ట్ భావజాలం.. బీజేపీలోకి ఎందుకు వెళ్తున్నానంటే.. ఈటల క్లారిటీ

    Telangana: అది ప్రగతి భవన్‌ కాదు.. బానిసల నిలయం.. సీఎం కేసీఆర్‌పై ఈటల సంచలన ఆరోపణలు
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Eetala rajender, Harish Rao, Huzurabad By-election 2021, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు