• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • TELANGANA MINISTER HARISH RAO LAID FOUNDATION FOR CHECK DAM ON MANJEERA RIVER AK

త్వరలోనే మంజీరా నదిపై చెక్ డ్యామ్ కల సాకారం: హరీశ్ రావు

త్వరలోనే మంజీరా నదిపై చెక్ డ్యామ్ కల సాకారం: హరీశ్ రావు

చెక్ డ్యామ్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు

సర్దన వద్ద చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్న హరీశ్ రావు... ఈ డ్యామ్‌ ఐదు గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు.

 • Share this:
  సమైక్య పాలకుల కుట్రల వల్లే మంజీరాపై చెక్‌ డ్యామ్‌ నిర్మించడం సాధ్యం కాలేదని అన్నారు మంత్రి హరీశ్ రావు. మెదక్ జిల్లాలోని హవెలి ఘన్‌పూర్‌ మండలం సర్దన గ్రామంలో మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మంజీరా నదిపై చెక్‌ డ్యామ్‌ నిర్మాణం కల త్వరలోనే నెరవేరనుందన్నారు. 12.50 కోట్ల రూపాయలతో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. కేసీఆర్‌ రైతుబిడ్డ అయినందునే ఈ కల నేరవేరుతుందని హరీష్‌రావు తెలిపారు. మెదక్‌ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నాయని వివరించారు. సర్దన వద్ద చెక్‌ డ్యామ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్న హరీశ్ రావు... ఈ డ్యామ్‌ ఐదు గ్రామాల ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు.

  పాపన్నపేటలో మూడు గ్రామాలు, ఘనపురం మండలంలో రెండు గ్రామాల రైతులకు లబ్ది చేకూరుతుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంజీరా నదిపై దాదాపు 15 చెక్‌డ్యామ్‌లు మంజూరు చేయించుకున్నామని హరీశ్ రావు గుర్తు చేశారు. సంగారెడ్డి జిల్లాలో ఫసల్వాది గ్రామం నుంచి చివరన సర్దన వరకు ఈ పదిహేను డ్యామ్‌ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. కొండపోచమ్మ సాగర్‌కు నీరు వచ్చిన వెంటనే హల్దీ ద్వారా బొల్లారం మత్తడికి నీరు వస్తాయని... అక్కడి నుంచి సర్దన చెక్‌డ్యామ్‌, కూచనపల్లి చెక్‌డ్యామ్‌కు కాళేశ్వరం నీళ్లు వస్తాయని హరీశ్ రావు అన్నారు. బొల్లారం మత్తడి కింద 13 వేల ఎకరాల ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వొచ్చని తెలిపారు. మంజీరా నదిపై చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని... 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు