హోమ్ /వార్తలు /తెలంగాణ /

Harish Rao: అవసరం లేకున్నా మందులు రాయొద్దు.. వైద్యులకు మంత్రి హరీశ్ రావు వినతి

Harish Rao: అవసరం లేకున్నా మందులు రాయొద్దు.. వైద్యులకు మంత్రి హరీశ్ రావు వినతి

మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు

మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు

అవసరం లేకున్నా.. ఉన్నా మందులు రాయడం వంటివి వైద్యులు చేయకూడదని మంత్రి హరీశ్ రావు కోరారు. అనవసరంగా మందులు వాడటం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుందన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అవసరం లేకున్నా.. ఉన్నా మందులు రాయడం వంటివి వైద్యులు చేయకూడదని మంత్రి హరీశ్ రావు కోరారు. టైమ్స్ ఐకాన్ ఆఫ్ హెల్త్ కేర్ అవార్డ్స్ లో తెలంగాణ ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనవసరంగా మందులు వాడటం వల్ల ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఒకరిద్దరు చేసే పని వల్ల అందరికీ చెడ్డ పేరు రావొద్దని సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని మంత్రి చెప్పారు. వైద్యులను సత్కరించుకోడం చాలా సంతోషంగా సంతోషంగా ఉందన్నారు. శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు తక్కువ ధరకే వాక్సిన్ అందుబాటులోకి తెచ్చారన్నారు. నేడు వాక్సిన్ల హబ్ గా హైదరాబాద్ ఎదిగిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అవార్డులు అందుకుంటున్న వైద్యులకు మంత్రి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యం బాగా ఉన్నవారే అసలైన ధనవంతులని మంత్రి అన్నారు. ఆస్తి, ఐశ్వర్యం ఉన్నవారు కాదన్నారు. పోస్ట్ కోవిడ్ ప్రభావం వల్ల అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారన్నారు.


WHO చెప్పిన అన్ని అంశాలపై మేము పని చేస్తున్నామన్నారు. ఆసుపత్రుల్లో ఎక్విప్మెంట్ తేవడంతో పాటు సకాలంలో వాటి మరమ్మతులు చేసేలా PMU ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కొత్తగా 8 మెడికల్ కాలేజీలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. 2014 లో 570 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే ఇప్పుడు 1000 దాకా పెంచుకున్నామన్నారు. ఎంఎన్జే లో కేన్సర్ స్పెషలైజ్డ్ నర్సింగ్ స్కూల్ ప్రారంభిస్తున్నామమన్నారు. దేశ బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి 1.1 శాతం కేటాయిస్తే, తెలంగాణలో బడ్జెట్ లో 4.5 శాతం కేటాయించామని మంత్రి చెప్పారు. ఒకప్పుడు మంచం పట్టిన పల్లెలు అని చదువుకునే వాళ్లమని మంత్రి ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు.


మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన నీటిని ఇంటింటికి అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి విజవంతంగా కావడం వల్ల సీజనల్ వ్యాధులు తగ్గామన్నారు. స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ.. ఆరోగ్య తెలంగాణగా అవతరించిందన్నారు. గడిచిన 8 ఏళ్లలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో వైద్య ఆరోగ్య రంగం గణనీయమైన అభివృద్ధిని సాధించిందన్నారు. ప్రభుత్వ విధానాలు, సంస్కరణల కారణంగా ఫార్మా, మెడికల్ రంగాల్లో దేశానికి తెలంగాణ హబ్ గా మారిందన్నారు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికులను, దేశానికి అన్నం పెట్టే రైతును, దేశ ప్రజలకు ప్రాణదానం చేసే వైద్యులను మర్చిపోకూడదన్నారు. అంతటి గొప్ప స్థాయిలో ఉన్న వైద్యులను సత్కరించడం గొప్ప విషయం అని అన్నారు.

First published:

Tags: Doctors, Harish Rao, Telangana

ఉత్తమ కథలు