హరీష్ రావు పెద్దమనసు.. అనాథ యువతికి ఆపన్నహస్తం.. పెళ్లి జరిపించిన మంత్రి

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పెళ్లి పెద్దగా మారారు. ఓ అనాథ యువతికి ఆపన్నహస్తం అందించారు. ఆమెను చదివించి, చక్కగా పెళ్లి చేశారు. అనాథ అయిన అభాగ్యురాలికి మంత్రి సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆపన్న హస్తం అందించారు.

news18-telugu
Updated: December 24, 2020, 10:18 PM IST
హరీష్ రావు పెద్దమనసు.. అనాథ యువతికి ఆపన్నహస్తం.. పెళ్లి జరిపించిన మంత్రి
భాగ్య పెళ్లి వేడుకకు హాజరైన మంత్రి హరీష్ రావు
  • Share this:
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పెళ్లి పెద్దగా మారారు. ఓ అనాథ యువతికి ఆపన్నహస్తం అందించారు. ఆమెను చదివించి, చక్కగా పెళ్లి చేశారు. అనాథ అయిన అభాగ్యురాలికి మంత్రి సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆపన్న హస్తం అందించారు. కష్ట కాలంలో ఉన్న బాలికకు విద్యా బుద్ధులు అందించి బతుకు దెరువుకై ఉపాధినిచ్చారు. పెళ్లి వయసు వచ్చిన భాగ్య అభీష్టం మేరకు గతంలో సౌదీలో డ్రైవర్ ఉద్యోగం చేసి తిరిగి స్వదేశానికి చేరుకున్న తర్వాత స్వయం కృషితో ఉపాధికై టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న ఇబ్రహీంనగర్ కు చెందిన రాజుతో వివాహాన్ని జరిపించారు. అనాథ బాలికకు అండగా.. చదువు నుంచి పెళ్లి దాకా అన్ని తామై మంత్రి హరీశ్, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి రాంగోపాల్ రెడ్డి, ఇతర అధికారులంతా కలిసి తమ ఇంటి కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా సంబరంగా పెండ్లి వేడుకను హట్టహాసంగా జరిపించి మానవత్వం చాటుకున్నారు.

చిన్నకోడూర్ మండలం కస్తూరిపల్లికి చెందిన భాగ్య తల్లిదండ్రులను కోల్పోయి ఎవ్వరూ పట్టించుకోక అభాగ్యురాలిగా మారింది. ఈ విషయం దిన పత్రికలలో చూసిన మంత్రి హరీశ్ రావు వెనువెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డితో మాట్లాడి.. భాగ్య చదువు, విద్య, ఉపాధి బాధ్యతలు తామే చూద్దామని సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో 2018లోనే మహిళా శిశు సంక్షేమ శాఖ అధీనంలో ఉన్న బాల సదనంలో ఆమెకు వసతి కల్పించారు. బాలల పరిరక్షణ విభాగంలో ఉద్యోగం కల్పించారు. మంత్రి, కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అధికారిక యంత్రాంగం ఆమె బాగోగులు చూస్తున్నారు. ఈ మేరకు గురువారం చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్ కు చెందిన యువకుడు రాజుతో సిద్ధిపేటలోని టీటీసీ భవనంలో వివాహం జరిగింది. ఈ పెళ్లికి పెద్దలుగా వ్యవహరించిన మంత్రి హరీశ్, కలెక్టర్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాల సదనంలోని చిన్నారులు, సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది సందడి చేసి ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు.


కేసీఆర్ దత్తపుత్రిక పెళ్లి త్వరలో
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తాను కోరుకున్నవాడు ప్రత్యూష జీవితంలోకి రాబోతున్నాడు. హైదరాబాద్ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డితో ప్రత్యూష నిశ్చితార్థ వేడుక అక్టోబర్ 19న జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రత్యూష నిశ్చితార్థ వేడుకను మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య పర్యవేక్షించారు. ప్రత్యూషను ఆమె పినతల్లి వేధింపులకు గురి చేయడంతో ఆమెను కేసీఆర్ దత్తత తీసుకున్నారు. వెంటనే బాధితురాలికి వైద్యం అందించారు. అనంతరం చదివించారు. ప్రత్యూష కూడా నర్సుగా ఉద్యోగం చేసుకుంటోంది. అనంతరం ఆమెకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించడంతో అధికారులు ఓసారి సంప్రదించి నిశ్చితార్థ వేడుక జరిపించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 24, 2020, 9:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading