హరీశ్‌రావుకు మరో పదవి.. కీలక కమిటీలో చోటు..

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై పని చేసేందుకు 2019 డిసెంబరులో ఈ కమిటీని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి సంబంధించి తాజాగా కొన్ని మార్పులు చేసింది.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం కీలకంగా మారిన సంగతి తిలిసిందే. ఈ క్రమంలోనే ఐజీఎస్టీ పరిష్కారంపై జీఎస్టీ మండలి మంత్రుల బృందంతో ప్రత్యేక కమిటీని నియమించింది. ఐజీఎస్టీ పరిష్కారం, సంబంధిత అంశాలపై పని చేసేందుకు 2019 డిసెంబరులో ఈ కమిటీని కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీకి సంబంధించి తాజాగా కొన్ని మార్పులు చేసింది. ఐజీఎస్టీ కమిటీకి సంబంధించి ఏడుగురు సభ్యులతో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త కమిటీలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు చోటు కల్పించింది.

    ఈ కమిటీకి బీహార్ ఆర్థిక శాఖ మంత్రి సుశీల్ కుమార్ మోదీని కన్వీనర్‌గా నియమించారు. ఈ కమిటీ ఐజీఎస్టీలో వచ్చే సమస్యలను పరిష్కరించడం, సంబంధిత అంశాలపై పని చేయనుంది. గతంలో కేంద్ర, రాష్ట్రాల పన్ను అధికారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులు, జీఎస్టీ ఇతర భాగస్వాములకు ఈ కమిటీలో స్థానం కల్పించేవారు. కానీ కేంద్రం తాజాగా పలు కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కేంద్ర జీఎస్టీ కార్యాలయంలో పైమార్పులకు సంబంధించి మెమోరాండం విడుదల చేసింది.
    Published by:Narsimha Badhini
    First published: