హోమ్ /వార్తలు /తెలంగాణ /

Harish Rao: తెలంగాణ రైతులకు మంత్రి హరీశ్ రావు శుభవార్త.. యాసంగి సాగుపై కీలక ప్రకటన.. బీజేపీ నేతలపై ఫైర్

Harish Rao: తెలంగాణ రైతులకు మంత్రి హరీశ్ రావు శుభవార్త.. యాసంగి సాగుపై కీలక ప్రకటన.. బీజేపీ నేతలపై ఫైర్

మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు

మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు

కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram project) మునిగిపోయింది.. యాసంగి పంట‌కు నీళ్లు రావని మాట్లాడుతున్న బీజేపీ (BJP) నాయ‌కుల‌పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు గారు మండిప‌డ్డారు. 45 రోజుల్లో పంపు హౌజ్‌ల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌న్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కాళేశ్వ‌రం ప్రాజెక్టు (Kaleshwaram project) మునిగిపోయింది.. యాసంగి పంట‌కు నీళ్లు రావని మాట్లాడుతున్న బీజేపీ నాయ‌కుల‌పై రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు (Minister Harish Rao) గారు మండిప‌డ్డారు. 45 రోజుల్లో పంపు హౌజ్‌ల్లో స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని, యాసంగి పంట‌కు నీరందిస్తాం.. రైతులు రందీ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీ (TRSLP) లో మంత్రి హ‌రీశ్‌రావు గారు మీడియాతో మాట్లాడారు. నిజానికి గోదావ‌రికి (Godawari River) చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేని విధంగా వ‌ర‌ద‌లు వ‌చ్చాయ‌ని మంత్రి హ‌రీశ్‌రావు గారు పేర్కొన్నారు. ‘‘గోదావ‌రికి అత్య‌ధికంగా 1986లో వ‌ర‌ద‌లు అధికంగా న‌మోదు అయ్యాయి. 1986లో 107.5 మీట‌ర్ల వ‌ర‌ద గోదావ‌రిలో (Godavari floods) వ‌చ్చింది. గోదావ‌రి న‌ది చ‌రిత్ర‌లోనే ఈ వ‌ర‌ద అత్య‌ధికం. మొన్న గోదావ‌రి న‌దికి చ‌రిత్ర‌లో ఎప్పుడూ లేనంత వ‌ర‌ద వ‌చ్చింది. ఈసారి 108.2 మీట‌ర్ల వ‌ర‌ద న‌మోదైంది. 1986లో వ‌చ్చిన వ‌ర‌ద కంటే కూడా 1.2 మీట‌ర్లు ఎక్కువ‌. ఈ అసాధార‌ణ‌మైన వ‌ర‌ద రావ‌డం వ‌ల్ల పంపు హౌజ్ రెగ్యులేట‌ర్ వ‌ద్ద‌ల ఉండే ర‌బ్బ‌ర్ సీల్‌లు ఊడిపోయి పంపు హౌజ్‌ల్లోకి నీళ్లు పోయాయి. ఇది దుర‌దృష్ట‌క‌రం. ఇది ప్రకృతి వైప‌రీత్యం. ప్ర‌కృతి వైప‌రీత్యం జ‌రిగిప్పుడు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయి.

2008లో శ్రీశైలంలో వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు రోశ‌య్య సెక్ర‌టేరియ‌ట్‌లో ప‌డుకున్నారు. అదొక అసాధార‌ణ‌మైన ప‌రిస్థితి. అప్పుడు శ్రీశైలంలో అన్ని పంపు హౌజ్‌లు కొట్టుకుపోయాయి. అలాంటి ప్ర‌త్యేక‌మైన ప‌రిస్థితి ఇప్పుడు గోదావ‌రికి వ‌చ్చింది. దానికి బీజేపీ నాయ‌కులు రాక్ష‌స ఆనందం పొందుతున్నారు. ప్రాజెక్టే పోయింద‌ని గోబెల్స్ ప్ర‌చారం చేస్తున్నారు. గోదావ‌రి న‌ది ఉప్పొంగి ప్ర‌వ‌హించ‌డం వ‌ల్ల రెండు పంపు హౌజ్‌ల్లోకి నీళ్లు వ‌చ్చాయి. మొత్తం ప్రాజెక్టే మునిగిపోయింద‌ని గోబెల్స్ ప్ర‌చారం చేస్తూ రాక్ష‌స ఆనందం పొందుతున్నారు. నీళ్లు రావు అని మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.’’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీజేపీవి అన్ని దింపుడు క‌ళ్లెం ఆశ‌లే అని చెప్పారు. బ్ర‌హ్మాండంగా యాసంగి పంట‌కు నీళ్లు ఇస్తాం. రైతులు రందీ పడాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి హ‌రీశ్‌రావు గారు స్ప‌ష్టం చేశారు.

Telangana: తెలంగాణలో 4,745 గ్రామాలకు కొత్త పంచాయతీ భవనాలు.. మంత్రి ఎర్రబెల్లి కీలక ప్రకటన.. వివరాలివే

కేంద్రమంత్రి షెకావత్‌ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మంత్రి హరీష్రావు తప్పుబట్టారు. షెకావత్ వ్యాఖ్యలను హరీష్రావు తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో షెకావత్ కూడా కాళేశ్వరాన్ని మెచ్చుకోలేదా? అని ప్రశ్నించారు. మెచ్చుకున్న నోటితోనే.. పుచ్చిపోయిన మాటలు మాట్లాడారని దుయ్యబట్టారు. ఆయనది నోరా?.. మోరీనా? అని హరీష్రావు ప్రశ్నించారు. కేంద్రానికి నచ్చితే నీతి.. నచ్చకపోతే అవినీతా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమేనని, అవి కట్టేందుకు కేంద్రమే అప్పులు ఇచ్చిందని గుర్తుచేశారు.

షేకావత్ దివాళాకోరు మాటలు ఖండిస్తున్నామని ప్రకటించారు. కాళేశ్వరానికి కితాబు ఇచ్చిన వారే మతలబు ఉందంటున్నారని విమర్శించారు. ‘‘గతంలో మీరు కాళేశ్వరంపై మాట్లాడిన మాటలు గుర్తుచేసుకోండి. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి గడ్కరీ తెలంగాణను ప్రశంసించిన వీడియోలు ఉన్నాయి. సీడబ్ల్యూసీ ఛైర్మన్ మసూద్ కూడా కాళేశ్వరంను ప్రశంసించారు’’ అని హరీష్రావు గారు గుర్తుచేశారు.

First published:

Tags: Farmers, Godavari floods, Godawari river, Harish Rao, Kaleshwaram project

ఉత్తమ కథలు