కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని.. మరోసారి ఆ ప్రాజెక్ట్ పేరుతో అవినీతికి పాల్పడేందుకు తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh shekawat) చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మంత్రి హరీశ్ రావు(harish Rao) తీవ్రంగా ఖండించారు. గతంలో ఈ ప్రాజెక్ట్‌ను మెచ్చుకున్న వాళ్లే.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై విమర్శలు చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. కాళేశ్వరం(Kaleshwaram Project) ప్రాజెక్ట్‌కు అన్ని అనుమతులను ఇచ్చింది కేంద్రమే అని వ్యాఖ్యానించారు. కేంద్ర పెద్దలు తమకు నచ్చితే నీతి లేకపోతే అవినీతి అన్నట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అప్పుడు ఒకలా.. ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్న వారిని నోరా లేక మోరినా అని మండిపడ్డారు.
గతంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు గడ్కరీ, షెకావత్, సీడబ్ల్యూసీ చైర్మన్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏం మాట్లాడారనే దానికి సంబంధించిన వీడియోలను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని గతంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వేసిన ప్రశ్నకు పార్లమెంట్‌లో కేంద్రమంత్రి సమాధానం చెప్పారని హరీశ్ రావు గుర్తు చేశారు. పార్లమెంట్‌లో అవినీతి జరగలేదని చెప్పిన కేంద్రం.. బయట మాత్రం ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పడం దారుణమని అన్నారు.
ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఆర్థిక సాయం చేసిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తిగా చెడిపోయిందనే ప్రచారం పూర్తిగా అబద్ధమని.. ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ ద్వారా అనేక ప్రాంతాలకు నీళ్లు వస్తున్నాయని విమర్శించారు. గోదావరి నది చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత వరద వచ్చిందని అన్నారు. ఈ కారణంగానే ప్రాజెక్ట్ మునిగిపోయిందని అన్నారు.
BJP Vijayashanti: తెలంగాణ బీజేపీలో కల్లోలం.. మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
Congress: తారాస్థాయికి తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు.. సోనియా వద్దకు కోమటిరెడ్డి, మర్రి?
గతంలో కృష్ణా నదికి రికార్డ్ స్థాయిలో వరదలు వచ్చినప్పుడు నాటి ముఖ్యమంత్రి రోశయ్య సెక్రటేరియట్‌లో ఉండి పరిస్థితిని సమీక్షించారని గుర్తు చేశారు. తాజాగా గోదావరి నదికి కూడా అదే తరహాలో వరదలు వచ్చాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏవైనా ఇబ్బందులు వచ్చినా.. ఐదేళ్ల పాటు వాటి రిపేర్ల బాధ్యత నిర్మాణ కంపెనీలదే అని హరీశ్ రావు అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం కంపెనీలకు ఎలాంటి డబ్బులు చెల్లించవని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, Kaleshwaram project, Telangana