YS Sharmila-Harish Rao: వైఎస్ షర్మిలకు పరోక్షంగా మంత్రి హరీశ్ రావు కౌంటర్..

హరీశ్ రావు, షర్మిల (ఫైల్ ఫోటో)

YS Sharmila Harish Rao: కొందరు ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించిన హరీశ్ రావు... అలాంటి వాళ్లకు అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా ? అని ప్రశ్నించారు.

  • Share this:
    తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. ఎక్కడి నుంచో ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారని పరోక్షంగా షర్మిలను ఉద్దేశించి మాట్లాడారు. కొందరు ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్లకు అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా ? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రూ. 12.500 మాత్రమే ఇస్తున్నారన్న హరీశ్ రావు.. తెలంగాణలో ఎకరానికి పదివేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో బుధవారం రైతు వేదికను ప్రారంభించిన హరీష్ రావు అనంతరం ఈ కామెంట్స్ చేశారు.

    ఇక తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించిన షర్మిల.. 2023లో దాదాపుగా ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్‌ఆర్ పాలనను తిరిగి తీసుకురావడమే తన ఎజెండా అని షర్మిల తెలిపారు. జగన్‌తో విభేదాల నేపథ్యంలోనే షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు వచ్చిన వార్తలపై షర్మిల స్పందించారు. తాను తెలంగాణలో పెట్టబోతున్న రాజకీయ పార్టీకి తన అన్నయ్య జగన్ మద్దతు లేదని ఎందుకు అనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. జగన్ తన సోదరుడని.. ఆయన పార్టీకి తాను మద్దతు తెలిపానని, తన పార్టీకి కూడా ఆయన మద్దతు ఉంటుందని ఆశిస్తున్నట్లు షర్మిల తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published: