హోమ్ /వార్తలు /తెలంగాణ /

కేసీఆర్ పుట్టిన రోజు...పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్ రావు పిలుపు

కేసీఆర్ పుట్టిన రోజు...పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్ రావు పిలుపు

కేసీఆర్, హరీశ్‌రావు

కేసీఆర్, హరీశ్‌రావు

ఈ నెల 17న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లాలో లక్ష మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ఈ నెల 17 ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినం సంధర్బంగా సిద్ధిపేట జిల్లాలో హరితహారం కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు ప్రతిఒక్కరు ఒక్కో మొక్క నాటాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఒక లక్షకు పైగా మొక్కలు నాటాలని లక్షంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరిత తెలంగాణ యజ్ఞం లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు ప్రతి ఒక్కరూ ఒక్కో మొక్కను నాటాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే పిలుపునివ్వడం తెలిసిందే.

కాగా ఆకుపచ్చని తెలంగాణ, పర్యావరణహిత రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ పరితపిస్తున్నారని, ఆయన స్వప్నాన్నినిజం చేసేందుకు ప్రతీ ఒక్కరూ పునరంకితం కావాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 17న అటవీ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు అందరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ఆదేశించారు. అడవుల సంరక్షణ, పునరుద్దరణపై ప్రజల్లోనూ విసృత అవగాహన కల్పించేదిశగా అటవీ శాఖ ఉద్యోగులు పనిచేయాలని మంత్రి సూచించారు. సీఎం ఆశయానికి అనుగుణంగా పనిచేసి ఆకుపచ్చ తెలంగాణ సాధన లక్ష్యంగా అటవీ శాఖ అధికారులు పని చేయాలన్నారు.

First published:

Tags: CM KCR, Harish Rao, Haritha haram, KTR

ఉత్తమ కథలు