హోమ్ /వార్తలు /తెలంగాణ /

Minister Harish rao: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభిప్రాయాలను పట్టించుకోవట్లేదు.. వ్యాక్సిన్లు ఇవ్వట్లేదు.. మంత్రి హరీశ్​ ఆరోపణలు

Minister Harish rao: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభిప్రాయాలను పట్టించుకోవట్లేదు.. వ్యాక్సిన్లు ఇవ్వట్లేదు.. మంత్రి హరీశ్​ ఆరోపణలు

హరీశ్​ రావు (ఫైల్​)

హరీశ్​ రావు (ఫైల్​)

కరోనా వ్యాక్సినేషన్​ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సూచనలను పట్టించుకోవట్లేదని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వ్యాక్సిన్ నిల్వలు ఉన్నా రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వడం లేదని  ఆరోపించారు. 

కరోనా వ్యాక్సిన్ (Corona vaccine) వేసుకొన్న వారిలో మరణాల శాతం చాలా తక్కువగా ఉందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు (Minister harish rao) చెప్పారు.  కరోనా వ్యాక్సినేషన్​ విషయంలో కేంద్ర ప్రభుత్వం (Central government) తెలంగాణ సూచనలను పట్టించుకోవట్లేదని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వ్యాక్సిన్ నిల్వలు ఉన్నా రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వడం లేదని  ఆరోపించారు. శుక్రవారం ఖమ్మం (Khammam) ఆసుపత్రిలో క్యాత్‌ల్యాబ్, ట్రామా కేర్ సెంటర్ ను మంత్రి హరీశ్​రావు  (Harish Rao) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు. బూస్టర్ డోస్ సమయాన్ని 3 నెలలకు తగ్గించాలని కోరామన్నారు.

అందరూ జ్వర సర్వే లో పాల్గొనాలి..

ఇప్పటి వరకు రాష్ట్రంలో 77,33,427 ఇండ్లల్లో జ్వర సర్వే చేశామన్నారు. జ్వర బాధితులకు 3,45,951 కిట్లను అందించామన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి జ్వర సర్వే  (Fever Survey)లో పాల్గొనాలి. టెస్టింగ్, హోం ఐసోలేషన్ కిట్లకు కొదువ లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని విధాలా ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా చెప్పారు.

60 ఏళ్ల వారికే కాకుండా అందిరికీ బూస్టర్ డోస్ (Booster dose) ఇవ్వాలని  కేంద్రాన్ని కోరినట్లు మంత్రి హరీష్ రావు  (Minister harish rao) తెలిపారు. ఈ విషయమై కేంద్రం నిర్ణయం తీసుకోవడం లేదన్నారు హరీశ్. ఇవాళ కేంద్ర మంత్రితో జరిగే సమావేశంలో ఈ విషయమై మరోసారి చర్చించనున్నట్టుగా హరీష్ రావు చెప్పారు. అభివృద్ది చెందిన దేశాల్లో బూస్టర్ డోస్ సమయాన్ని మూడు నుంచి 4 నెలలకు తగ్గించిన విషయాన్ని హరీశ్​ గుర్తు చేశారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కరోనాతో ప్రాణాపాయం లేదన్నారు.

వ్యాక్సిన్ వేసుకోని వారిలోనే కరోనా మరణాలు..

60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్ వేసుకోవాలని మంత్రి సూచించారు. కరోనా వ్యాక్సినేషన్​లో రెండో స్థానంలో ఖమ్మం (Khammam) జిల్లా నిలిచిందని మంత్రి తెలిపారు. దక్షిణ భారత దేశంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసి కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని మంత్రి గుర్తుచేశారు. ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకొన్న వారిలో మరణాల శాతం చాలా తక్కువగా ఉందని మంత్రి హరీష్ రావు  (Minister harish rao) చెప్పారు. వ్యాక్సిన్ వేసుకోని వారిలోనే కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ కు దూరంలో ఖమ్మం ఉంటుంది. ఇక్కడి ప్రజలకు ఉపయోగ పడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేశామన్నారు. గుండె సంబంధ సమస్యలకు లక్షల్లో ఖర్చు అయ్యే చికిత్స ఇక్కడ ఉచితంగా అందనుందన్నారు.

మంత్రి పువ్వాడ అజయ్ కోరిక మేరకు కీమో థెరపీ, రేడియో థెరపీ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి హరీష్ రావు (Minister harish rao). వచ్చే ఆర్థిక ఏడాదిలో ఎం అర్ ఐ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని మార్చురీలను ఆధునీకరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని చెప్పారు.

First published:

Tags: Central governmennt, Corona Vaccine, Harish Rao, Khammam

ఉత్తమ కథలు