మంత్రి పదవి నుంచి తప్పిస్తారని ఊహాగానాలు...స్పందించిన ఈటల

టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ ఫైల్ ఫోటో

కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన పలు అంశాలను ఈటల రాజేందర్ లీక్ చేశారని..ఆయనపై కేసీఆర్ కోపంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అందుకే మంత్రి వర్గం నుంచి ఆయన్ను తొలగిస్తారని వార్తలు వచ్చాయి.

 • Share this:
  తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తప్పిస్తారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కోపంగా ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించబోతున్నారని పలు పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి. ఈ ఊహాగానాలపై స్వయంగా మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. అలాంటి గాలి వార్తలను ఎవరూ నమ్మవద్దని ప్రజలకు సూచించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టవద్దని పార్టీ కార్యకర్తలు, అభిమానులకు సూచించారు.

  కొన్ని పత్రికల్లో నిరాధారమైన, అసత్యమైన గాలి వార్తలు వస్తున్నాయి దయచేసి అటువంటి వార్తలపై స్పందించ వద్దని, సోషల్ మీడియా లో కూడా పోస్టులు పెట్టవద్దని పార్టీ కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తున్నా.
  ఈటల రాజేందర్, మంత్రి
  కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన పలు అంశాలను ఈటల రాజేందర్ లీక్ చేశారని..ఆయనపై కేసీఆర్ కోపంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అందుకే మంత్రి వర్గం నుంచి ఆయన్ను తొలగిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనపై తనపై వస్తున్న వార్తలను ఈటెల రాజేందర్ ఖండించారు. అవన్నీ ఒట్టి పుకార్లేనని స్పష్టంచేశారు.
  Published by:Shiva Kumar Addula
  First published: