TELANGANA MINISTER ETELA RAJENDAR REVIEW WITH HEALTH MINISTRY OFFICIAL AK
అంతా ప్రభుత్వ సూచనలు పాటించాలి: మంత్రి ఈటల
ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)
వాక్సిన్ వచ్చేంతవరకు కరోనా వైరస్ తో సహజీవనం తప్పదు కాబట్టి జాగ్రతలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
లాక్ డౌన్ సడలింపుల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున బయటికి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మరింత అప్రమత్తత అవసరం అన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. వాక్సిన్ వచ్చేంతవరకు కరోనా వైరస్ తో సహజీవనం తప్పదు కాబట్టి జాగ్రతలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బయటికి వస్తున్న వారు తప్పకుండా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని కోరారు. ఇంట్లో చిన్న పిల్లలు, వృద్దులు ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవాలి అని ఈటల రాజేందర్ కోరారు. గ్రామాల్లో జ్వర పరీక్షలపై మంత్రి ఆరా తీశారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారిని, నాన్ కోవిద్ పేషంట్లను విడివిడిగా చూడాలని కోరారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వరకు వాటిల్లోనున్న మందుల స్టాక్ పై మంత్రి ఈటల సమీక్షించారు. అన్నీ ఆసుపత్రుల్లో సరిపోయేంత స్థాయిలో మందులు ఉండేలా చూడాలని సూచించారు. కరోనా వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాస సంబంధ సమస్యలు వస్తున్నాయి కాబట్టి అన్ని హాస్పిటల్స్ లో ఆక్సిజేన్ సదుపాయం ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం ఇస్తున్న గైడ్ లైన్స్‌ను తప్పకుండా పాటించాలని కోరారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.