• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • TELANGANA MINISTER ETELA RAJENDAR INTERESTING COMMENTS ON CM KCR AK

Etela Rajendar: కేసీఆర్‌పై అజమాయిషీ ఉంది.. తెలంగాణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Etela Rajendar: కేసీఆర్‌పై అజమాయిషీ ఉంది.. తెలంగాణ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఈటల రాజేందర్( ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణలో కరెంటు, నీళ్లు, విత్తనాలు, ఎరువుల కష్టాలు పోయాయని.. మనకు కావల్సింది..ఏ పంట వేస్తే మంచి లాభం వస్తదనే విషయమే అని అన్నారు.

 • Share this:
  తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌తో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందన్న మంత్రి ఈటల రాజేందర్.. తన మీద ఆయనకు అజమాయిషీ ఉందని అన్నారు. ఆయనపై కూడా తనకు అజమాయిషీ ఉందని పేర్కొన్నారు. జమ్మికుంట మండలం వావిలాల క్లస్టర్ రైతు చైతన్య వేదికను రైతులకు అంకితం చేసిన అనంతరం మంత్రి ఈటల ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తనకు ఇష్టం లేని పని ఎంత చెప్పినా అస్సలు వినరని.. ఇష్టమైన పని చెబితే వెంటనే చేస్తారని అన్నారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం ఎన్నో చేస్తున్నారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఇప్పుడు ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

  అంతా అనుకునే మాటలనే తాను చెబుతున్నానని చెప్పారు. ప్రభుత్వానికి మానవీయకోణం ఉందని.. ఎస్ఆర్ఎస్‌పీ టెయిల్ ఎంత అయిన ఈ ప్రాంతానికి నీళ్లు అందించామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్ కరెంటు కష్టాలు లేకుండా చేశారని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గతంలో గొర్లకు, బర్లకు ఎండాకాలంలో నీళ్లు లేక తొట్లు కట్టామని.. కానీ మిషన్ కాకతీయతో ఇప్పుడు నీళ్ళకు కొదవలేదని అన్నారు.

  ప్రస్తుతం తెలంగాణలో పంట ఎండే పరిస్థితి లేదని.. రాష్ట్రంలో ప్లాన్డ్‌గా సాగు సాగుతోందని అన్నారు. రైతు వేదిక ఒక పవిత్రమైన జాగా అని ఈటల అన్నారు. ఇప్పుడు ఇక్కడ రైతును రాజును చేసే చర్చ జరగాలని మంత్రి ఈటల అన్నారు. తెలంగాణలో కరెంటు, నీళ్లు, విత్తనాలు, ఎరువల కష్టాలు పోయాయని.. మనకు కావల్సింది..ఏ పంట వేస్తే మంచి లాభం వస్తదనే విషయమే అని అన్నారు. వచ్చిన పంట ఎక్కడ అమ్మితే మంచిగా డబ్బులు వస్తాయనే చర్చకు రైతు వేదికలు వేదిక కావాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు